Home » మరోసారి బండ్ల గణేష్ వివాదాస్పద వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

మరోసారి బండ్ల గణేష్ వివాదాస్పద వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

by Anji
Ad

టాలీవుడ్ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ మరొక వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. నందమూరి తారకరత్న భౌతికకాయానికి నివాళులర్పించేందుకు ఆయన ఇంటికి వెళ్లిన చంద్రబాబు అక్కడనే ఉన్నటువంటి విజయసాయిరెడ్డితో మాట్లాడారు. వీరిద్దరినీ ఉద్దేశించి బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు నెటిజన్ల ఆగ్రహానికి కారణం అయింది.

Advertisement

తారకరత్నకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వరుసకు  మేనమామ అవుతారు. చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి తారకరత్నకి స్వయాన మేనత్త. అదేవిధంగా తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి విజయసాయిరెడ్డికి వరసకు కూతురు అవుతుంది. విజయసాయిరెడ్డి భార్య యొక్క సోదరి కూతురే అలేఖ్య రెడ్డి. ఈ నేపథ్యంలోనే తారకరత్న మృతితో విషాదంలో ఉన్న అలేఖ్య రెడ్డి ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు  విజయసాయిరెడ్డి అక్కడే ఉన్నారు. అంతేకాదు.. అక్కడికి వచ్చిన వారితో నందమూరి కుటుంబ సభ్యులు, ఇతరులతో ఆయన మాట్లాడడం కాకుండా.. జరగాల్సిన కార్యక్రమాల గురించి చర్చిస్తూ వచ్చారు. ఈ తరుణంలోనే అక్కడికి వచ్చిన బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, చంద్రబాబులతో పాటు విజయసాయి రెడ్డి మాట్లాడారు. 

Also Read :   ‘సార్’ మూవీని రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో…!

Advertisement

ఏపీ రాజకీయాల్లో ప్రత్యర్థులైన చంద్రబాబు, విజయసాయిరెడ్డి పక్క పక్కనే కూర్చొని మాట్లాడుతున్న ఫోటో, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీరిద్దరూ తారకరత్నకి ఇరువైపులా బంధువులు కావడంతో విషాద సమయంలో చేయాల్సిన కార్యక్రమాల గురించి మాట్లాడుకుంటున్నారని అంతా భావిస్తున్నారు. చాలా వరకు ఈ ఘటనకు ఎలాంటి దురుద్దేశాలు అపాదించలేదు. బండ్ల గణేష్ మాత్రం ఈ ఫోటోను ట్విట్టర్ షేర్ చేస్తూ సంచలన కామెంట్స్ చేసారు. తాను ప్రాణం పోయినా శత్రువు అనుకున్న వ్యక్తితో ఈ విధంగా కూర్చొని మాట్లాడనని అన్నారు. బతికితే సింహంలా బతకాలి.. చచ్చిపోతే సింహంలా చచ్చిపోవాలని పేర్కొన్నారు. దీంతో బండ్ల గణేష్ తీరును తప్పుబడుతూ పలువురు నెటిజన్లు ఆయనపై విమర్శలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో పలు సందర్భాల్లో బండ్ల గణేష్ ట్వీట్స్ పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.  

Also Read :  తారకరత్నని చివరి చూపు చూసేందుకు మోహన్ బాబు రాకపోవడానికి కారణం అదేనా..?

Visitors Are Also Reading