Home » Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఈ రాశుల వారికి ఆర్థికంగా బాగుంటుంది

Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఈ రాశుల వారికి ఆర్థికంగా బాగుంటుంది

by Anji
Ad

రాశి ఫ‌లాలు  చ‌ద‌వ‌డం వ‌ల్ల ఏ రాశి వారి ఫ‌లితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఈ వారం ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Weekly Horoscope in Telugu 21.08.2022 నుండి 27.08.2022 వరకు

మేషం :

Mesha

Mesha

 

వ్యాపారంలో లాభాలుంటాయి. ఉద్యోగంలో న‌మ్మ‌కంతో ప‌ని చేయాలి. సంక‌ల్పం బలంగా ఉండాలి. కాలం మిశ్ర‌మంగా ఉంది. పొర‌పాటు జ‌రుగ‌నివ్వ‌వ‌ద్దు. కుటుంబ స‌భ్యుల స‌ల‌హాలు ప‌ని చేస్తాయి. మాన‌సిక సంఘ‌ర్ష‌ణ లేకుండా చూసుకోవాలి. అపార్థాల‌కు తావు ఇవ్వ‌కూడ‌దు. ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి.

Advertisement

Weekly Horoscope in Telugu: వృషభం 

Vrushabha

Vrushabha

అద్భుత‌మైన‌ విజ‌యం ఉంటుంది. ధ‌ర్మ‌మార్గంలో ప్ర‌య‌త్నాలు స‌ఫ‌ల‌మ‌వుతాయి. ఆత్మ‌విశ్వాసం పెరుగుతుంది. అనుకున్న‌ది సాధిస్తారు. ధ‌ర్మం మిమ్మ‌ల్ని కాపాడుతుంది. నిస్సంకోచంగా ప‌నులు ప్రారంభించండి. ఆర్థిక‌స్థితి మెరుగుప‌డుతుంది. వ్యాపారంలో మిశ్ర‌మ ఫ‌లితం ఉంటుంది.

Weekly Horoscope in Telugu : మిథునం

Mithuna

Mithuna

ఉద్యోగంలో స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించి ప్ర‌శంస‌లు అందుకుంటారు. స్థిర‌త్వం ల‌భిస్తుంది. ల‌క్ష్యాన్ని చేరుతారు. వ్యాపారం బ‌ల‌ప‌డుతుంది. లాభాలుంటాయి. ఖ‌ర్చు విష‌యంలో ఆలోచించండి. బంధుమిత్రుల స‌హ‌కారం ల‌భిస్తుంది. ఆనందించే అంశాలున్నాయి. భ‌విష్య‌త్‌కి అవ‌స‌ర‌మైన నిర్ణ‌యం తీసుకునే స‌మ‌యం ఇది.

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

ఆశించిన ఫ‌లితం వెంట‌నే ల‌భిస్తుంది. ఉద్యోగంలో కోరుకున్న‌ట్టుగానే జ‌రుగుతుంది. ఒత్తిడిని ద‌గ్గ‌ర‌కి రానీయ్య‌కుండా ప్ర‌స‌న్న చిత్తంతో ప‌ని చేయాలి. స‌మాజంలో గుర్తింపు విశేష‌మైన కీర్తి ల‌భిస్తాయి. నూత‌న ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. ఆస్తి వృద్ధి చెందుతుంది. గ‌తంలో ఉన్న కొన్ని స‌మ‌స్య‌లు తొలుగుతాయి.

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

వ్యాపారంలో అద్భుత‌మైన విజ‌యం ఉంది. ప‌నులు పూర్తి అవుతాయి. సంకోచం వ‌ద్దు. న‌మ్మ‌కం లేని అంశాల్లోకి ప్ర‌వేశించ‌వ‌ద్దు. ప‌ట్టుద‌ల ర‌క్షిస్తుంది. మొహ‌మాటం వ‌ల్ల స‌మ‌స్య‌లు ఎదురుకాకుండా చూసుకోవాలి. ప‌నుల్లో స్ప‌ష్ట‌త అవ‌స‌రం. ఇంట్లో వారి సూచ‌న‌లు లేకుండా ప‌ని చేస్తాయి. ఆదిత్య హృద‌యం చ‌ద‌వండి.

Weekly Horoscope in Telugu : కన్య

Kanya

Kanya

ఆర్థికంగా బాగుంటుంది. అధికారుల నుంచి ఇబ్బందులు ఉండ‌వ‌చ్చు. సంద‌ర్భానికి త‌గిన‌ట్టు వ్య‌వ‌హ‌రించండి. ఏకాగ్ర‌త‌తో స్ప‌ష్ట‌మైన నిర్ణ‌యాలు తీసుకోండి. న‌మ్మిన ధ‌ర్మ‌మే ముందు న‌డిపిస్తుంది. వ్యాపారంలో శ్ర‌ద్ధ వ‌హించాలి. ఇంట్లోవారి సూచ‌న‌ల‌తో స‌మ‌స్య తొల‌గిపోతుంది.

Advertisement

ఇవి కూడా చ‌ద‌వండి :  Chanakya Niti : తెలివైన వ్య‌క్తుల్లో ఈ అల‌వాట్లు త‌ప్ప‌కుండా ఉంటాయి..! 

Weekly Horoscope in Telugu : తుల

Thula

Thula

ఆత్మ‌విశ్వాసంతో ప‌ని ప్రారంభించండి. అంతా శుభ‌మే జ‌రుగుతుంది. ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది. చంచ‌ల‌త్వం వ‌ల్ల స‌మ‌స్య రాకుండా జాగ్ర‌త్త ప‌డాలి. సొంత నిర్ణ‌యం మంచిది. ఇత‌రులు ప‌క్క‌దోవ ప‌ట్టించే అవ‌కాశ‌ముంది. ఆర్థికంగా న‌ష్టం వాటిల్ల‌కుండా చూసుకోవాలి. నిందారోప‌ణ‌లు చేసే వారు ఉంటారు.

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

 

ఉత్త‌మ కాలం న‌డుస్తుంది. అదృష్ట‌వంతులు అవుతారు. ఉద్యోగంలో ఉన్న‌త స్థితి గోచ‌రిస్తోంది. కాలం అన్ని విధాలుగా స‌హ‌క‌రిస్తోంది. ప్ర‌తీ ప‌నిలో విజ‌యం ఉంటుంది. త‌గినంత మాన‌వ ప్ర‌య‌త్నం చేయండి. ల‌క్ష్యం చేరువ‌లోనే ఉంది. మ‌న‌సులోని కోరిక‌లు నెర‌వేరే కాల‌మిది. భూగృహ వాహ‌నాది శుభ‌యోగాలు ఉంటాయి.

Weekly Horoscope in Telugu : ధనస్సు

Dhanassu

Dhanassu

శ్ర‌మ ఫ‌లిస్తుంది. ఆశ‌యం నెర‌వేరుతుంది. ఎదురుచూస్తున్న ప‌ని పూర్త‌వుతుంది. స్వ‌ల్ప విఘ్నాలు ఎదురైనా అంతిమ విజ‌యం ల‌భిస్తుంది. ఉద్యోగంలో ఒత్తిడికి గురి చేసే వారు ఉన్నారు. స‌మ‌యాన్ని బ‌ట్టి స్పందించండి. వ్యాపారంలో ఆలోచించి నిర్ణ‌యం తీసుకోండి. శుభ‌ఫలితం ల‌భిస్తుంది.

Weekly Horoscope in Telugu : మకరం

Makara

Makara

 

ముఖ్య‌మైన కార్యాల‌ను వాయిదా వేయండి. ప్ర‌తీ అడుగు ఆలోచించి వేయండి. అపార్థాల‌కు తావివ్వ‌కూడ‌దు. అభ‌ద్ర‌తా భావాన్ని రానివ్వ‌కూడ‌దు. మిత్రుల సూచ‌న‌లు తీసుకోవాలి. పొర‌పాటు జ‌రిగితే దానిని వాడుకుంటారు కాబ‌ట్టి జాగ్ర‌త్త‌గా ప‌ని చేయ‌డం ఉత్త‌మం. ఆర్థికంగా మిశ్ర‌మ కాలం.

Weekly Horoscope in Telugu : కుంభం

Kumbham

Kumbham

గౌర‌వ ప్ర‌ద‌మైన జీవితం ల‌భిస్తుంది. ఉద్యోగంలో మిశ్ర‌మ ఫ‌లితం సూచిస్తుంది. అపార్థాల‌కు తావివ్వ‌కండి. చంచ‌ల‌త్వం వ‌ద్దు తెలియ‌ని ఒత్తిడి ఎదుర‌వుతుంది. శాంతంగా ఆలోచించాలి. విఘ్నాలు ఇబ్బంది పెట్టినా అశాంతికి గురికావ‌ద్దు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. బందు మిత్రుల‌తో సంప్ర‌దింపులు మేలు చేస్తాయి.

Weekly Horoscope in Telugu : మీనం

Meena

Meena

ఉత్త‌మ భ‌విష్య‌త్‌కి సూచితం. ముఖ్య కార్యాల్లో విజ‌యం ల‌భిస్తుంది. త‌గినంత ప్ర‌య‌త్నం చేయండి. ప్ర‌తి ప‌నిలో లాభ‌ముంటుంది. గృహ‌, వాహ‌న ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో శ్ర‌ద్ధ వ‌హించాలి. కుటుంబ స‌భ్యుల స‌ల‌హాతో స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రించుకోవాలి. వారం మ‌ధ్య‌లో స్థిర‌మైన విజ‌యం ల‌భిస్తుంది.

ఇవి కూడా చ‌ద‌వండి :  Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు వివాదాల‌కు దూరంగా ఉండాలి

Visitors Are Also Reading