Home » విరాట్ కోహ్లీనే వద్దనుకున్న ఐపీఎల్ ఫ్రాంచైజీ.. ఎందుకో తెలుసా ? 

విరాట్ కోహ్లీనే వద్దనుకున్న ఐపీఎల్ ఫ్రాంచైజీ.. ఎందుకో తెలుసా ? 

by Anji
Ad

ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో టీమిండియా  మాజీ సారథి  విరాట్ కోహ్లీది విడదీయరాని బంధం అనే చెప్పాలి. ముఖ్యంగా 2008 ఐపీఎల్ ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఒకే ఫ్రాంచైజీకి ఆడుతున్న ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లీనే కావడం విశేషం. 2013 నుంచి 2021 వరకు వరుసగా 9 సీజన్లలో ఆర్సీబీకి అతడు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గకపోయిన ఫ్రాంచైజీ ఫ్యాన్స్ మదిలో విరాట్ కి ప్రత్యేక స్థానముంది. ఒక రకంగా చెప్పాలంటే.. విరాట్ అంటే ఆర్సీబీ.. ఆర్సీబీ అంటే విరాట్ అనేంత ఫ్యాన్స్ గుండెల్లో చెరగని ముద్ర వేశాడు.  

Also Read :  IPL 2023 : 14 ఏళ్ల సచిన్ పగ.. చల్లార్చిన అర్జున్..!

Advertisement

ఐపీఎల్ లో కోహ్లీ లేకుండా బెంగళూరు జట్టును అసలు ఊహించుకోలేం. బెంగళూరుకు  ఆడటం పై విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ దశలో ఆర్సీబీని తాను వీడాలని అనుకుంటున్నట్టు చెప్పాడు. టాప్ ఆర్డర్ లో ఆడే ఛాన్స్ లభించకపోవడమే ఇందుకు కారణం అన్నారు. ఐపీఎల్ మొదటి మూడు సీజన్లలో విరాట్ ఎక్కువగా 5, 6 స్థానాల్లో బ్యాటింగ్ కి దిగేవాడు. దీంతో నిరుత్సాహానికి గురయ్యాయని చెప్పాడు. ఐపీఎల్ జర్నీ అద్భుతంగా ఉందన్నారు కోహ్లీ. బెంగళూరుతో భాగస్వామ్యం, ప్రయాణానికి తాను ఎంతో విలువను ఇస్తానని తెలిపాడు. తొలి మూడు సీజన్లలో ఫ్రాంచైజీ తనకు చాలా మద్దతుగా నిలిచిందని పేర్కొన్నాడు. 

Advertisement

Also Read :  పెళ్లిళ్లు చేసుకోవడంలో తెలంగాణ యువతులే బేటరా..ఆ సర్వే ఏం చెబుతుందంటే..?

“ ఆర్సీబీ ఫ్రాంఛైజీ నాకు ఎప్పుడూ మద్దతుగానే నిలుస్తూ వస్తుంది. ప్లేయర్లను అట్టిపెట్టుకునే సమయం వచ్చినప్పుడు నన్ను కొనసాగించింది. టీమిండియా తరుపు మూడో స్థానంలో ఆడతాను కాబట్టి ఫ్రాంచైజీ తరుపున అదే పొజిషన్ లో బ్యాటింగ్ చేస్తానంటే దానికి రే జెన్నింగ్స్ ఒప్పుకున్నారు. అవసరమైనప్పుడు నా మీద చాలా విశ్వాసం చూపించారు. అప్పుడు ఇంటర్నేషనల్ కెరీర్ లో ఎదుగుతున్నా.. టాప్ ఆర్డర్ లో  ఆడే ఛాన్స్ కోసం మరో ఫ్రాంచైజీని సంప్రదించాను. దాని పేరు మాత్రం చెప్పను. వాళ్లు నా మాట వినేందుకు ఆసక్తి చూపించలేదు. భారత్ తరుపున సత్తా చాటడంతో అదే ఫ్రాంచైజీ నా దగ్గరకు వచ్చి.. దయచేసి మీరు వేలానికి అందుబాటులో ఉంటారా అని అడిగింది. ఛాన్సే లేదు. నాకు సపోర్ట్ గా నిలిచిన ఫ్రాంచైజీతోనే ఎప్పటికీ ఉంటాను అని సమాధానం చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ. 

Also Read :  కర్నాటక ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్‌ !

Visitors Are Also Reading