Home » కోహ్లీ భవిష్యత్తు ఈ రెండు సిరీస్లపైనే..!

కోహ్లీ భవిష్యత్తు ఈ రెండు సిరీస్లపైనే..!

by Azhar
Ad

భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రతుతం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అనే విషయం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. 2019 లో ఫామ్ కోల్పోయిన విరాట్ ఇప్పటికి కూడా దానిని మళ్ళీ అందుకోలేదు. అయితే కెప్టెన్ వదిలిస్తే కోహ్లీ రాణిస్తాడు అని అనుకున్నా.. అది జరగలేదు. మూడు ఫార్మాట్లలో కెప్టెన్ గా వైదొలిగిన కోహ్లీ బ్యాటింగ్ లో మార్పు అనేది రాలేదు. మాములుగా ఏ ఆటగాడు అయినా సరే ఇంతకాలం రాణించకుంటే జట్టులో చోటు కోల్పోవడం ఖాయం. కానీ కోహ్లీని బీసీసీఐ మాత్రం ఇంకా జట్టులో ఉంచుతుంది. కానీ టీం ఇండియాలో ఓ స్థానం కోసం ఉన్న పోటీ వల్ల ఇంకా కోహ్లీని జట్టులో ఉంచడం బీసీసీఐకి భారంగా మారుతుంది.

Advertisement

అందుకే ఇప్పుడు విరాట్ కు ఆఖరి అవకాశం ఇవ్వాలని బీబీసీ నిర్ణయించుకుంది. అయితే ఇప్పటీకే వెస్టిండీస్ వెళ్లే వన్డే జట్టు నుండి సీనియర్ ఆటగాళ్లు అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా, భువనేశ్వర్, పంత్ ఇలా అందరికి విశ్రాంతిని ఇచ్చింది. ఈ క్రమంలోనే కోహ్లీ భవిష్యత్తు అనేది ఇప్పుడు ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న వన్డే, టీ20 సిరీస్ ల పైన ఆధారపడి ఉన్నాయని తాజాగా ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. ఆ సదరు అధికారి మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ ఇప్పుడు పరుగులు చేయడం లేదు. ఐపీఎల్ లో కూడా విఫలమయ్యాడు. అందుకే అతనికి ఇంకా అవకాశాలు ఇవ్వకూడదు అని సెలక్టర్లు అనుకుంటున్నారు.

Advertisement

ఈ విండీస్ పర్యటనలో వన్డే సిరీస్ నుండి బీసీసీఐ విశ్రాంతి ఇచ్చిన ఆటగాళ్లు అందరూ టీ20 సిరీస్ లో ఆడుతారు. కానీ కోహ్లీ మాత్రం ఇప్పుడు ఇంగ్లాండ్ పర్యటనలో రాణిస్తేనే అతను జట్టులో ఉంటాడు. లేదంటే లేదు. అందుకే ఈ ఇంగ్లాండ్ పర్యటన ముగిసిన తర్వాతే విండీస్ తో టీ20 సిరీస్ కు బీసీసీఐ జట్టును ప్రకటించనుంది అని ఆ అధికారి పేర్కొన్నారు. ఐపీఎల్ లో రాణించిన చాలా మంది ఆటగాళ్లు అందుబాటులో ఉండగా ఇంకా కోహ్లీకి ఎందుకు అవకాశాలు ఇవ్వాలి అనే ఉద్దేశ్యంలో బీసీసీఐ సెలక్టర్లు ఉన్నారు అంటూ ఆ అధికారి కామెంట్స్ చేసారు.

ఇవి కూడా చదవండి :

మరో ఇండియా VS పాకిస్థాన్ సమరానికి సమయం సిద్ధం..!

ఉమ్రాన్ ప్రపంచ కప్ జట్టులో.. క్లారిటీ ఇచ్చిన రోహిత్..!

Visitors Are Also Reading