Home » Virat Kohli : ఆసీస్ ప్లేయర్లను ర్యాగింగ్ చేసిన కోహ్లీ !

Virat Kohli : ఆసీస్ ప్లేయర్లను ర్యాగింగ్ చేసిన కోహ్లీ !

by Bunty

విరాట్ కోహ్లీ మైదానంలో ఏం చేసినా అదొక సెన్సేషన్ గా మారుతుంది. అయితే నిన్న జరిగిన రాజ్‌ కోట్‌ వన్డేలో ఎండలకు ఇబ్బంది పడిన ఆసీస్ బ్యాటర్లు స్మిత్‌ లకు లబుషేన్ ర్యాగింగ్‌ చేశాడు విరాట్ కోహ్లీ. అసలేం జరిగిందంటే… గత కొన్ని రోజులుగా టీం ఇండియా ఎక్కడికి వెళ్లినా కూడా వర్షం స్వాగతం పలుకుతోంది. అయితే మొదటి వన్డే జరిగిన మొహాలీలో మాత్రం వేడి తట్టుకోలేక తీవ్రంగా ఇబ్బందిపడ్డారు టీమిండియా బౌలర్లు. శార్దూల్ ఠాకూర్ తో పాటు షమీ, బూమ్రా కూడా బౌలింగ్ చేసేటప్పుడు ఇబ్బందిపడ్డారు.

Virat Kohli Dances With Labuschagne As Steve Smith Gets Full Drinks Break Spa Treatment

Virat Kohli Dances With Labuschagne As Steve Smith Gets Full Drinks Break Spa Treatment

మొహాలీలో పిచ్ బౌలర్లకు సహకరించడంతో ఆసీస్ బౌలర్లు ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. అయితే రాజ్కోట్ లో సీన్ మారింది. బ్యాటింగ్ కు అద్భుతంగా అనుకూలించే రాజ్కోట్ లో ఆస్ట్రేలియా బ్యాటర్లు క్రీజ్ లో కుదురుకున్నారు. కానీ ఇక్కడి ఎండలు ఆసీస్ బ్యాటర్లను చాలా ఇబ్బంది పెట్టాయి. 74 పరుగులు చేసిన స్మిత్ తలమీద ఐస్ బ్యాగ్ పెట్టుకొని సేద తీరారు. ఇదే సమయంలో లబుషేన్ వద్దకు వెళ్లి విరాట్ కోహ్లీ డ్యాన్స్ చేశారు.

అయితే విరాట్ కోహ్లీ…లబుషేన్ ను ఏదో అడగడం, దానికి ఆసీస్ బ్యాటర్లు సమాధానం ఇవ్వడం, లభిషేన్ తో విరాట్ కోహ్లీ ఏం మాట్లాడాడో మాత్రం వినిపించలేదు. కానీ ఆ తర్వాత మాత్రం చాలా మంది పెట్టిన కామెంట్లు ఏంటంటే… ఎండగా ఉంది, ఉక్కపోతగా ఉంది, వేడిగా ఉంది అంటే ఇప్పుడు తెలిసిందా మా బాధ అన్నట్టుగా విరాట్ కోహ్లీ డాన్స్ చేశాడు. అయితే పక్కనున్న స్మిత్ ని చూసి కూడా విరాట్ కోహ్లీ ఫన్నీగా జోక్స్ వేశాడు. అందరూ కూడా చాలా మంచి స్ఫూర్తితో ముందుకు వెళ్లారు.

https://x.com/superking1816/status/1706982623787290804?s=20

https://x.com/superking1816/status/1706982623787290804?s=20

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading