Home » అలనాటి స్టార్ కమెడియన్ అనూజ గుర్తుందా..? ఇప్పుడు ఎంతలా మారిపోయిందంటే..?

అలనాటి స్టార్ కమెడియన్ అనూజ గుర్తుందా..? ఇప్పుడు ఎంతలా మారిపోయిందంటే..?

by Mounika
Published: Last Updated on
Ad

కొందరు నటీమణులు వెండితెరపై కనిపించింది కొంతకాలమే అయినా.. వారి నటనతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంటారు. అలా తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి అనుజా రెడ్డి . ఈమె తెలుగింటి అమ్మాయి అయినప్పటికీ కూడా.. మలయాళ చిత్ర పరిశ్రమ ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. కేవలం మాతృభాషలోనే కాకుండా వేరే భాష చిత్రాల్లో నటిగా, హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

actress-anuja

Advertisement

 

అనూజ రెడ్డి గురించి ఇప్పటి వారికి తెలియకపోవచ్చు.. 1980 దశాబ్ద కాలంలో హీరోయిన్‌గా, సెకండ్‌ హీరోయిన్‌గా, లేడీ కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా 200లకు పైగా చిత్రలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక, అనూజ వ్యక్తిగత విషయానికి వస్తే.. ఆమె గుంటూరు జిల్లాలో జన్మించారు. ఆమెకు మూడేళ్లు వయసు ఉ‍న్నపుడు కుటుంబం చెన్నైకి వెళ్లి స్థిరపడిందట. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే సమయానికి ఆమె వయసు కేవలం 14 సంవత్సరాలు మాత్రమే. అనూజ రెడ్డి సినీరంగ ప్రవేశం కూడా అనుకోకుండా జరిగిపోయిందట.

Advertisement

1980లో అనూజ రెడ్డి కుటుంబం చెన్నైలోని కోడంబాక్కంలో ఉండే సమయంలో ఓ సినిమా కోసం తెలుగు అమ్మాయిని వెతుకుతుండగా సినిమా టీం అనూజ రెడ్డి ఉండే ఏరియాకు రావటం జరిగిందట. అనూజను చూడగానే చిత్రాయూనిట్ కి నచ్చటంతో ఆమెను సినిమాలో పాత్ర కోసం తీసుకున్నారట. అలా మలయాళ ఇండస్ట్రీ ద్వారా చిత్రసీమకు పరిచయమయ్యారు అనూజ.

ఈమె ఎక్కువగా అప్పటిలో బ్రహ్మానందానికి జోడిగా నటించేవారు. బ్రహ్మానందం, అనూజ కాంబినేషన్‌లో వచ్చిన కామెడీ ట్రాక్‌లకు అప్పటిలో మంచి క్రేజ్‌ ఉండేది. చంటి, పెళ్లి చేసుకుందాం సినిమాల్లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2004 వరకు అనూజ ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలో నటించారు. ఇక సినిమాల్లో బిజీగా ఉన్న టైంలోనే ప్రేమ వివాహం చేసుకున్నారు. సినిమాలలో నటిస్తున్న సమయలోనే గర్భం దాల్చిన అనూజ అప్పటినుంచి సినిమాలకు దూరం అయ్యారు. ఈమె గత కొంతకాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడంతో ఆమె ఫోటోలు కాస్త నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

స్వేచ్ఛ అంటే ఇదేనా..? ఇలా ఓటీటీలో రెచ్చిపోతే.. నేటి తరం యువత నాశనానికి మీరే కారణం అవుతారు..!

ఎవరు ఈ ఓం రౌత్..? ప్రభాస్ తో ఇతని కలిపింది ఎవరు..?

శ్రీలీల చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన చిత్రం ఏదో తెలుసా..?

Visitors Are Also Reading