Home » స్వేచ్ఛ అంటే ఇదేనా..? ఇలా ఓటీటీలో రెచ్చిపోతే.. నేటి తరం యువత నాశనానికి మీరే కారణం అవుతారు..!

స్వేచ్ఛ అంటే ఇదేనా..? ఇలా ఓటీటీలో రెచ్చిపోతే.. నేటి తరం యువత నాశనానికి మీరే కారణం అవుతారు..!

by Mounika
Published: Last Updated on
Ad

కరోనా సమయంలో థియేటర్లు మూతపడటంతో ఓటీటీ సంస్థలకు భారీగా డిమాండ్ పెరిగింది. థియేటర్లలో సినిమాలు చేసేందుకు ఇష్టపడే ప్రేక్షకులు సైతం ఓటీటీలకు బాగా అలవాటుపడిపోయ్యారు. అయితే ప్రస్తుత పరిస్థితులు మారడంతో థియేటర్లో తిరిగి ఓపెన్ అయ్యాయి. ప్రజలు తిరిగి థియేటర్లకు వెళ్లడం మొదలుపెట్టారు. ఈ దెబ్బతో ఓటీటీ సంస్థల మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది. అంతేకాకుండా ఓటీటీల్లో పోటీ కూడా తీవ్రంగా పెరగడంతో కొన్ని సంస్థలు వెనక పడ్డాయి. ఈ దెబ్బకు కొత్తకొత్త కాన్సెప్టులతో వెబ్ సిరీసులను నిర్మించడంతోపాటు కొత్త సినిమాలను రిలీజ్ చేస్తూ ఓటీటీ ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి.

Advertisement

 

ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సంస్థలు చేస్తున్న ప్రయత్నాలు హద్దులు దాటినట్టుగా అనిపిస్తుంది. ఆడ,మగ, హీరో హీరోయిన్ అనే తేడా లేకుండా స్టార్ సెలబ్రిటీలు సైతం స్వేచ్ఛ వచ్చినట్లుగా రెచ్చిపోతున్నారు. ఇప్పటివరకు వెండితెరపై ఎంతో పద్ధతిగా కనిపించిన హీరో, హీరోయిన్లు సైతం బూతులు మాట్లాడితూ, విచ్చలవిడిగా ఎక్స్ పోజింగ్ తో అభ్యంతరకరమైన సన్నివేశాల్లో నటించడానికి సైతం వెనకాడటం లేదు. ఇదేనా నటీనటులకు ఉన్న విచక్షణ.. వాళ్ల జ్ఞానం ఇంతేనా.. లేక డబ్బులిస్తే దేనికైనా రెడీ అనే మనస్తత్వంతో ఉన్నారా.. అంటూ జనాల్లో ప్రశ్నలు మొదలయ్యాయి..

Advertisement

ఓటీటీ నిర్మాతలు సైతం బూతులు లేకపోతే వెబ్ సిరీస్ సక్సెస్ సాధించలేదనే స్థాయికి దిగజారారు. ఇక రానా నాయుడులో వెబ్ సిరీస్ లో వెంకటేష్ బూతులు మాట్లాడడం చూసి ప్రేక్షకులు సైతం కంగుతిన్నారు. ఎంతో పద్ధతిగా ఉన్న మా హీరో ని సైతం ఎలా మార్చేశారు ఏంటి అంటూ ఆయన అభిమానలు సైతం నిరాశ వ్యక్తం చేశారు. ఆ టైమ్ లో వెంకటేష్ పై ఓ రేంజ్ లో ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇలా చెప్పుకుంటూపోతే కియరా అద్వానీ నుంచి నిన్నటి సమంత, తమన్న వరకు అంతా బోల్డ్ పేరిట రెచ్చిపోయినవాళ్లే. అభ్యంతరకరమైన సన్నివేశాలు లేకపోతే, ఓటీటీ సిరీస్ లేదా..? ఒరిజినల్ ఫిలిమ్ తీయడం దండగ అన్నట్టు పరిస్థితిని మార్చేశారు ఓటీటీ నిర్మాతలు.

నిజానికి ఇదే స్వేచ్ఛ అనుకుంటే అది పెద్ద తప్పు అనే చెప్పాలి. బోల్డ్ లేదా సెన్సార్ కంటెంట్ అంటే అభ్యంతరకరమైన సీన్స్ మాత్రమే కాదు. సెన్సార్ కత్తెర పడుతుందని భావించే ప్రతి అంశాన్ని ఓటీటీలో చర్చించాలి. కేలవం అసభ్యకరమైన సన్నివేశాలు లేకపోతే ఓటీటీ కంటెంట్ క్లిక్ అవ్వదు, ప్రేక్షకులు ఇదే కోరుకుంటున్నారనే భ్రమ నుంచి మేకర్స్ బయటకు రావాలి.

అంతేకాకుండా హీరో, హీరోయిన్లు సైతం నిర్మాతలు మాటలకు తలవంచి బోల్డ్ సీన్స్ లో నటిస్తూ పోతే రాబోయే తరాలను నాశనం చేయడానికి మొదటి కారకులవుతారనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అసభ్యకరమైన వీడియోలు ఇప్పటి తరానికి ఒక్క క్లిక్ తో అందుబాటులోకి వచ్చేశాయనే వితండవాదాన్ని పక్కనపెట్టి.. నటీనటులు, మేకర్స్, ఓటీటీ సంస్థలు.. నేటితరం చెడువైపు అడుగులు వెయ్యకుండా తమ వ్యక్తిగత బాధ్యతగా భావించాలి.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

ఎవరు ఈ ఓం రౌత్..? ప్రభాస్ తో ఇతని కలిపింది ఎవరు..?

అలనాటి ఈటీవీ సీరియల్స్ హీరోయిన్స్ గుర్తున్నారా..! వారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే..?

సినిమా స్టార్ట్ అయిన అరగంట తరువాత హీరో ఎంట్రీ ఇచ్చిన సినిమాలు.. ఓ లుక్ వెయ్యండి!

Visitors Are Also Reading