Home » అలనాటి ఈటీవీ సీరియల్స్ హీరోయిన్స్ గుర్తున్నారా..! వారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే..?

అలనాటి ఈటీవీ సీరియల్స్ హీరోయిన్స్ గుర్తున్నారా..! వారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే..?

by Mounika

మన తెలుగింటి ఆడవాళ్లు ఆరు రోజులైనా అన్నం తినకుండా ఉంటారేమో గాని.. అర నిమిషం కూడా సీరియల్స్ చూడకుండా ఉండలేరు. టీవీలు వచ్చిన మొదటిలో దూరదర్శన్ ఛానల్ ద్వారా అడపదడప ఋతురాగాలు, మహాభారతం,శక్తిమాన్ వంటి సీరియల్ ని అప్పుడప్పుడు చూసి ఊరుకునేవారు. 1995లో రామోజీరావు ఏ ముహూర్తం ఈటీవీ ఛానల్ ని మొదలుపెట్టారో గాని.. అందులో ప్రసారమయ్యే సీరియల్లకు తెలుగు మహిళా లోకం దాసోహం అయిపోయింది.

ఇంటిలో ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టేసి మరీ.. ఈటీవీ ఛానల్ లో ప్రసారమయ్యే సీరియల్స్ కోసం టైం ప్రకారం చిన్న, పెద్ద అంతా టీవీల ముందు వాలిపోయేవారు. ఇప్పుడైతే రేటింగ్ లో ఈటీవీ కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు కానీ.. అప్పటిలో ఈటీవీలో ప్రసారమయ్యే లేడీ డిటెక్టివ్, స్నేహ, అన్వేషిత, అంతరంగాలు వంటి సీరియల్స్ తెలుగు మహిళా ప్రేక్షకులను టీవీల ముందు కట్టిపడేసి రేటింగ్ లో నెంబర్ వన్ పొజిషన్ లో ఉండేది. కేవలం ఆ సీరియల్స్ కే కాదు.. అందులో నటించిన లీడ్ రోల్ ఫిమేల్ క్యారెక్టర్స్ కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఈ సీరియల్స్ ద్వారా గుర్తింపు పొందిన ఆ నటీమణులు ఎవరు..? ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసుకుందాం..

#1 ఉత్తర :

ఈటీవీ లో డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో వచ్చిన ‘లేడీ డిటెక్టివ్’ సీరియల్ అప్పటిలో మంచి సక్సెస్ అయ్యింది. ఇక ఈ సీరియల్ లో హీరోయిన్ ఉత్తర పోలీసులకు సైతం పరిష్కారం దొరకని కేసులను, తన తెలివితేటలతో చాలా సులువుగా చేదించే లేడీ డిటెక్టివ్ గా నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. ఉత్తర కేవలం సీరియల్ లోనే కాకుండా.. ఈమె మొదటిగా 1993లో శ్రీకాంత్, జెడి చక్రవర్తి హీరోలుగా చేసిన వన్ బై టు, వడ్డే నవీన్ హీరోగా నటించిన కోరుకున్న ప్రియుడు వంటి పలు చిత్రాలలో నటించింది. ఉత్తర లేడీ డేటిక్టివ్ సీరియల్ తర్వాత మరే సీరియల్స్ లోనూ నటించలేదు. ఉత్తర నటిగా నటజీవితానికి గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది.

#2 కావేరి :

ఈటీవీలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న మరో సీరియల్ ‘స్నేహ’. ఇందులో హీరోయిన్ గా నటించిన కావేరి సమాజంలో తన చుట్టూ ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ స్వేచ్ఛను కోరుకునే ఆడపిల్లల నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈమె 2013లో రాకేష్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరమైంది.

#3. యమున :

థ్రిల్లర్ నేపథ్యంలో ప్రసారమైన ‘అన్వేషిత’ సీరియల్ అప్పటిలో బుల్లితెర అభిమానులను బాగా ఆకట్టుకుంది. అన్వేషిత సీరియల్ లో అచ్యుత్, యమున కీలక పాత్రలో పోషించారు. అతి తక్కువ కాలంలోనే ఈ సీరియల్ మంచి సక్సెస్ అయ్యింది. ఈ సీరియల్ అప్పటిలో పలు విభాగాలలో 8 నంది అవార్డులు సొంతం చేసుకుంది. ఈ సీరియల్స్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటి యమున మొదటి నుంచి కూడా అనేక చిత్రాల్లో హీరోయిన్గా నటించారు. ఇప్పటికీ కూడా యమున పలు సీరియల్స్ లో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు.

#4. కల్పన :

ఇక ఈటీవీలో ప్రసారమైన అంతరంగాలు సీరియల్ కూడా అప్పటిలో సెంటిమెంట్ తో ప్రేక్షకులను కట్టుపడేసేది. ఈ సీరియల్ లో అచ్యుత్, శరత్ బాబు, కల్పన లు కీలక పాత్రలు పోషించారు. ఇక కల్పన ఆ తర్వాత పలు సీరియల్స్ లో కూడా నటించారు. కల్పన పెళ్లి తర్వాత ఇండస్ట్రీని దూరం పెట్టింది.

#5. జ్యోతి రెడ్డి :

ఈటీవీలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న మరో సీరియల్ ఎండమావులు. ఇందులో నటించిన జ్యోతి రెడ్డి వెండితెరపై ఎన్నో సినిమాలలో నటించారు. ఆ తర్వాత కాలంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని పెళ్లి చేసుకుని దాదాపు 20 సంవత్సరాలు పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ప్రస్తుతం జ్యోతి రెడ్డి రక్తసంబంధం, నేత్ర, శ్రీమతి శ్రీనివాస్ వంటి సీరియల్స్ లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.

Visitors Are Also Reading