Home » శ్రీలీల చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన చిత్రం ఏదో తెలుసా..?

శ్రీలీల చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన చిత్రం ఏదో తెలుసా..?

by Mounika
Ad

ప్రస్తుతం టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్ ఎవరని అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు శ్రీలీల. పెళ్లి సందD చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల భామ ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. యూత్ లో శ్రీలీలకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని నిర్మాతల సైతం ఆమె వద్దకు భారీ ఆఫర్లతో క్యూ కడుతున్నారు. ఆమె మొదటి చిత్రం పెళ్ళిసందD యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే శ్రీలీల మాత్రం టాలీవుడ్ నిర్మాతల దృష్టిలో పడింది. ధమాకా మూవీతో రవితేజ ఎనర్జీకి ఏమాత్రం తగ్గకుండా శ్రీలీల గట్టి పోటీ ఇచ్చింది. ఇక ధమాకా చిత్రంతో మొదటి సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంది.

srileela

Advertisement

ప్రస్తుతం ఆమె ఖాతాలో అరడజనుకు పైగా తెలుగు చిత్రాలు ఉన్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్, భగవంత్ కేసరి, గుంటూరు కారం వంటి చిత్రాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. నేడు శ్రీలీల తన 22వ పుట్టినరోజును జరుపుకుంటుంది. 2001 జూన్ 14న అమెరికాలో పుట్టిన శ్రీలలా.. ఆమె తల్లి స్వర్ణలత భర్తతో విడాకులు తీసుకుని విడిపోవడంతో అమెరికా నుండి బెంగుళూరు వచ్చి స్థిరపడ్డారు . శ్రీలీల ప్రస్తుతం ఎం.బి.బి.ఎస్ చదువుతుంది.

Advertisement

చిన్నతనం నుంచి భరతనాట్యం నేర్చుకున్న శ్రీలీల ప్రొఫెషనల్ డాన్సర్ గా ఎన్నో వేదికలపై ప్రదర్శనలు ఇచ్చింది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ శ్రీలీల మీద ఫోటో షూట్ చేయగా.. ఆమె లుక్స్ నచ్చి దర్శకుడు ఏపీ అర్జున్ 2019 లో కిస్ చిత్రం ద్వారా హీరోయిన్గా అవకాశం ఇచ్చారు. అలా శ్రీలీల కిస్‌ అనే కన్నడ చిత్రంతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయ్యింది.

అయితే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వకముందే శ్రీలీలా ఒక చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిందనే సంగతి చాలా మందికి తెలియదు. ఆ చిత్రం ఏమిటంటే.. 2017లో హీరోయిన్ అంజలి మెయిన్ లీడ్ లో నటించిన చిత్రాంగద మూవీ .. ఈ చిత్రంలో హీరోయిన్ సింధూ తులాని ఒక కీలక పాత్ర పోషించారు. సింధూ తులాని చిన్ననాటి పాత్రలో శ్రీలీల నటించి మొదటిగా వెండితెరపై కనిపించారు.

Visitors Are Also Reading