Home » విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకునేది ఆమెనేనా..? మ్యారేజ్ పై క్లారిటీ..!

విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకునేది ఆమెనేనా..? మ్యారేజ్ పై క్లారిటీ..!

by Anji
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ స్టార్ హీరో విజయ్ దేవరకొండకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అర్జున్ రెడ్డి మూవీతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ వరుస సినిమాలు చేస్తూ.. చాలా బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఖుషి సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీని శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలోని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. 

Advertisement

అదేవిధంగా రౌడీ స్టార్ అభిమానులకు ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. లైగర్ మూవీ అట్టర్ ఫ్లాప్ కావడంతో ఇప్పుడు వచ్చే సినిమాపై విజయ్ దేవరకొండ హై ఎక్స్ పెక్టేషన్ పెట్టుకున్నాడు. ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలి. ఇక ఈ విషయాన్ని పక్కకు పెడితే.. విజయ్ దేవరకొండకు సాధారణంగా అమ్మాయి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువగానే ఉంది. తాాజాగా విజయ్ దేవరకొండ తన ప్రేమ పెళ్లి పై ఓ క్లారిటీ ఇచ్చారు. ఓ మీడియా ఛానల్ కి అడిగిన ప్రశ్నకు విజయ్ దేవరకొండ సమాధానం ఇస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

Advertisement

లవ్ మ్యారేజ్ చేసుకుంటారా లేక అరెంజ్ మ్యారేజ్ చేసుకుంటారా అని యాంకర్ ప్రశ్నించగా.. దానికి బదులుగా విజయ్ దేవరకొండ లవ్ లేదా అరేంజ్ రెండింటిలో ఏదో ఒకటి చేసుకోవాలి కదా.. నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ మా పేరేంట్స్ ఏది డిసైడ్ చేస్తారో నేను అదే ఫాలో ఫాలో అవుతాను అని క్లారిటీ ఇచ్చారు విజయ్ దేవరకొండ. ఇక మొత్తానికి విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీ చూసిన సంబంధాన్ని చేసుకుంటాడని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

నటి సుజాత జీవితంలో పడిన ఇబ్బందుల గురించి తెలిస్తే కన్నీరు పెట్టకుండా ఉండరు..!

ప్రభాస్ కల్కి మూవీ వాయిదా..? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ 

Visitors Are Also Reading