Home » ప్రభాస్ కల్కి మూవీ వాయిదా..? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ 

ప్రభాస్ కల్కి మూవీ వాయిదా..? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ 

by Anji
Ad

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఆదిపురుష్ మూవీ ప్రేక్షకులు మెప్పించకపోవడంతో సలార్, కల్కి సినిమాల విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాల నుంచి ఇటీవలే విడుదలైన గ్లింప్స్ అంచనాలను మరింత పెంచేశాయి. సలార్ మూవీ పూర్తిగా యాక్షన్ మూవీగా రాబోతుండగా.. కల్కీ సైన్స్ ఫిక్షన్ మూవీగా రాబోతుంది. తొలిసారి ప్రభాస్ ఇలాంటి నేపథ్యమున్న సినిమాలో నటిస్తుండటంతో ఈ మూవీపై మంచి క్యూరియాసిటీ నెలకొంది. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే మంచి హైప్ నెలకొంది. కొద్ది రోజులుగా ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

Advertisement

ముఖ్యంగా ప్రభాస్ కల్కి మూవీ రిలీజ్ వాయిదా పడుతుందనే ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ వార్తలపై స్పందించారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఓ ప్రముఖ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ్ అశ్విన్ కల్కీ మూవీ గురించి మాట్లాడారు. “కల్కీ షూటింగ్ కొంచెం మిగిలి ఉందని.. త్వరలోనే దానని పూర్తి చేస్తాం. ప్రస్తుతం ఫోకస్ మొత్తం దానిపైనే ఉంది. పూర్తయిన తరువాత విడుదల తేదీ గురించి ఆలోచిస్తాం. మంచి రోజు చూసుకొని దీని గురించి ప్రకటిస్తాను. ఈ మూవీలో అందరూ కొత్త ప్రపంచాన్ని చూస్తాను. ఇప్పటివరకు ప్రభాస్ ఇలాంటి లుక్ లో కనిపించలేదు. అందుకోసమైనా ఆడియన్స్ ఈ సినిమాని కచ్చితంగా చూడాలి. థియేటర్ కి వచ్చిన వారందరూ సరికొత్త అనుభూతి పొందుతారు” అంటూ చెప్పుకొచ్చారు నాగ్ అశ్విన్. 

Advertisement

ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారని మొదటి పార్ట్ ని మే 09న రిలీజ్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. వీఎఫ్ఎక్స్ వర్క్ సైతం చాలా సమయం తీసుకోనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకకొణే, దిశా పటాని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లోకనాయకుడు కమల్ హాసన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తుండటంతో మరింత హైప్ పెరిగింది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ ఫస్ట్ పార్ట్ మే 09న విడుదల చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. దీనిపై ఎలాంటి అఫిషియల్ ప్రకటన మాత్రం రాలేదు. ఈ మూవీ ఎప్పుడు విడుదలవుతుందో వేచి చూడాలి మరీ. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

రీమేక్ మూవీస్ గురించి మెగాస్టార్ ఏమన్నారో తెలుసా ?

 Nayanatara : నయనతార మొత్తం ఆస్తుల విలువ ఎంతో తెలుసా ?

Visitors Are Also Reading