Home » ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? డైరెక్టర్ సర్ ‘ఆది పురుష్’ పోస్టర్ లో మిస్టేక్ గమనించారా?

ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? డైరెక్టర్ సర్ ‘ఆది పురుష్’ పోస్టర్ లో మిస్టేక్ గమనించారా?

by Bunty
Ad

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రెబెల్ స్టార్ ప్రభాస్ సినిమా వస్తుందంటే చాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు మొత్తం సంబరాలు చేసుకుంటున్నారు. ప్రభాస్ వరుసగా పాన్ ఇండియన్ సినిమాలే చేస్తున్నాడు. ఇక ప్రభాస్ హీరోగా ఓంరౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రామాయణం ఆధారంగా రూపొందిస్తున్నారు.

Advertisement

ఈ చిత్రంలో ప్రభాస్ రాముని పాత్రలో, కృతి సీత పాత్రలో నటించనున్నారు. రామాయణంలో కీలక పాత్ర అయినటువంటి రావణాసురుడి పాత్రలో సైఫ్ ఆలీ ఖాన్ కనిపించనున్నారు. ఇక ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. దీంతో ట్రైలర్ లోని సన్నివేశాలను షేర్ చేసి మరి సినిమా చిత్రీకరణలోని లోటుపాట్లు చెబుతున్నారు. తాజాగా హనుమంతుడు ఎగురుతున్న ఫోటో వైరల్ గా మారింది. ఆ పోస్టర్ లో అపార్ట్మెంట్స్, భవనాలు కనిపిస్తున్నాయి.

Advertisement

మన రామాయణ కాలంలో ఎంత ఎత్తైన భవనాలను కూడా నిర్మించారా అంటూ ఆది పురుష్ సినిమా ట్రైలర్ ని చూసి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఈ విషయాన్ని ఫ్యాన్స్ ఏ మాత్రం తట్టుకోలేకపోతున్నారు. ఆది పురుష్ ట్రైలర్లో చూపించిన ఓ సన్నివేశంలో హనుమంతుడు ఎగురుతున్నప్పుడు అతని పక్కన నిలబడి ఉన్న ఎత్తైన భవనాలు కనిపిస్తాయి. రామాయణం ప్రకారం ఆ సన్నివేశంలో లాజికల్ గా అనిపించదు. దీనిపై అభిమానులు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో సినిమా తీసినప్పుడు ఇలాంటివి కూడా చూసుకోవాలని ఆగ్రహిస్తున్నారు.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

కాంగ్రెస్‌ లోకి మళ్లీ రానున్న కోమటి రెడ్డి రాజగోపాల్‌..క్లారిటీ ఇదే

చంద్రబాబు చెబితే పవన్ కళ్యాణ్ విడాకులు ఇస్తున్నాడు – సీఎం జగన్

ఆ ప్రైవేట్ పార్ట్ కు సర్జరీ… కృతిశెట్టి క్లారిటీ!

 

Visitors Are Also Reading