Home » భార్యతో హనీమూన్ ట్రిప్, 10 లక్షలు డిమాండ్…. ఆ ఫోటోలతో భర్త దారుణం!

భార్యతో హనీమూన్ ట్రిప్, 10 లక్షలు డిమాండ్…. ఆ ఫోటోలతో భర్త దారుణం!

by Bunty
Published: Last Updated on

పెళ్లి అంటే ఆశామాషి యవ్వారం కాదు. సాధారణంగా పెళ్లిడు వచ్చిందంటే చాలు చాలా మంది పెళ్లి గురించి ఆలోచిస్తారు. అయితే పూర్వకాలంలో ఈ తంతు ఎక్కువగా నడిచేది. ప్రతి ఒక్కరి ఆలోచన మారింది. జీవితంలో ఒక పొజిషన్ కు వచ్చాక పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. ఈ జనరేషన్ లో 30 ఏళ్లు దాటినా కానీ పెళ్లి ఊసెత్తడం లేదు. అయితే తాజాగా భార్యతో హనీమూన్ ట్రిప్ కోసం 10 లక్షలు డిమాండ్ చేశాడు ఓ భర్త.

ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూసింది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే యూపీకి చెందిన యువకుడు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫిలిబిత్ కు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. ఈ తరుణంలోనే ఆ యువకుడు తన భార్యను హనీమూన్ కి తీసుకెళ్లాలంటే 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడట. పది లక్షలు ఇస్తేనే హనీమూన్ అని తేల్చి చెప్పాడట యువకుడు. దీంతో చేసేది ఏమీ లేక వధువు కుటుంబ సభ్యులు వరుడుకి 5 లక్షల రూపాయలు ఇచ్చారు.

దాంతో హ్యాపీగా భార్యను హనీమూన్ కి తీసుకెళ్లాడు. మే 7వ తేదీన భార్యను వెంటబెట్టుకుని నైనిటాల్ కు హనీమూన్ కి వెళ్ళాడు. అక్కడ భార్యతో అభ్యంతరకర ఫోటోలు, వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డాడు. తను డిమాండ్ చేసిన పది లక్షల్లో మిగతా ఐదు లక్షల కూడా ఇవ్వాలని, లేదంటే ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది ఈ పెళ్లి కూతురు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

కాంగ్రెస్‌ లోకి మళ్లీ రానున్న కోమటి రెడ్డి రాజగోపాల్‌..క్లారిటీ ఇదే

ఆ ప్రైవేట్ పార్ట్ కు సర్జరీ… కృతిశెట్టి క్లారిటీ!

Devara : దండయాత్ర చేసేందుకు వచ్చాడు రా “దేవర”

Visitors Are Also Reading