Home » కాంగ్రెస్‌ లోకి మళ్లీ రానున్న కోమటి రెడ్డి రాజగోపాల్‌..క్లారిటీ ఇదే

కాంగ్రెస్‌ లోకి మళ్లీ రానున్న కోమటి రెడ్డి రాజగోపాల్‌..క్లారిటీ ఇదే

by Bunty
Ad

కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. పార్టీ మారుతున్నాని వస్తున్న వార్తలను ఖండిస్తున్నానని కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల తర్వాత నేడు ఎక్కడ ఈ మాటలు అన లేదు…కథనాలు సృష్టించి వార్తలు రాస్తున్నారని ఆగ్రహించారు. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌ మళ్లీ వెళుతున్నారని నిన్నటి నుంచి ప్రచారం జరిగింది. అయితే.. ఈ వార్తలపై స్వయంగా కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు.

Advertisement

రాజకీయంగా ఎదుర్కొనలేక నా పై ఉపఎన్నికలలో దుష్ప్రచారం చేసి నేను ఓటమి చెందేలా చేసారు… రేవంత్ రెడ్డి సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకుని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించాడన్నారు. కర్నాటక ఫలితాల తర్వాత కొంత మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్లు నా మిత్రులు నన్ను తిరిగి కాంగ్రెస్ లోకి రమ్మని అడుగుతున్న మాట వాస్తవం అని చెప్పారు. కర్నాటక లో కాంగ్రెస్ గెలిచినంత మాత్రాన తెలంగాణ లో కాంగ్రెస్ లో గెలవాలని లేదు..కేంద్రంలో అధికారంలో లేకుండా , బలమైన నాయకత్వం లేకుండా తెలంగాణ లో కేసీఆర్ ను ఓడించడం సాధ్యం కాదన్నారు.

Advertisement

రేవంత్ రెడ్డి, ఉత్తమ్, జానా రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క ల ఆధ్వర్యంలో నాలుగు గ్రూపులు తయార య్యాయని…. ఎన్నికలు జరగలేదు, ఫలితాలు రాలేదు అప్పుడే నాలుగు గ్రూపులు తమ నేత ముఖ్యమంత్రి అంటూ ప్రచారం మొదలుపెట్టాయని మండిపడ్డారు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి. నాకు పదవులు అవసరం లేదు. తెలంగాణ లో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బిజెపి అని తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు…ఎన్నికలకు మరో ఆరు నెలల సమయం ఉంది, బిజెపి పుంజుకుంటుంది. చేరకలు పెద్దఎత్తున ఉంటాయని వివరించారు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Sunisith : ఉపాసన తో గోవాకు సునిశిత్…చితక్కొట్టిన మెగా ఫ్యాన్స్‌!

SPY Movie : నిఖిల్ స్పై టీజర్ రిలీజ్..దుమ్ములేసిపోయింది

Visitors Are Also Reading