Home » వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ తరువాత బయటపడిన సీక్రెట్.. రెండు ఫ్యామిలీలు ఉలిక్కీ పడ్డాయా ?

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ తరువాత బయటపడిన సీక్రెట్.. రెండు ఫ్యామిలీలు ఉలిక్కీ పడ్డాయా ?

by Anji
Ad

టాలీవుడ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి మెగా కోడలు అవుతుందని ఎవ్వరూ కూడా అస్సలు ఊహించలేదు. వరుణ్ తేజ్, లావణ్య కలిసి శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన మిస్టర్ సినిమాలో నటించారు. ఆ టైమ్ లోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి.. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇన్ని రోజులు బయటికీ చెప్పకుండానే చాలా సైలెంట్ మెయింటైన్ చేశారు వీరు. జూన్ 09న మణికొండలోని గల నాగబాబు నివాసంలో వీరి ఎంగేజ్ మెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఫంక్షన్ కి కేవలం మెగా కుటుంబ సభ్యులు, లావణ్య కుటుంబ సభ్యులతో పాటు కొద్ది మంది మాత్రమే సినీ ప్రముఖులు హాజరయ్యారు. 

Advertisement

సోషల్ మీడియాలో వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టిందోనని తెగ చర్చించుకోవడం గమనార్హం. వీరు చాలా సున్నితంగా ఉంటున్నారు. మిస్టర్ మూవీలో లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్ వరుణ్ తేజ్ కి జోడిగా నటించింది. ఈ మూవీ భారీ డిజాస్టర్ గా నిలిచింది. అయితేనేం వరుణ్ కి మాత్రం ఆ సినిమాతో మంచి తోడు దొరికింది. మిస్టర్ సినిమా సెట్స్ లోనే వరుణ్ లావణ్య త్రిపాఠికి ఆకర్షితుడయ్యాడు. వరుణ్ తో  చాలా చనువుగా ఉండటం వల్ల ఆమె కూడా వరుణ్ పట్ల అభిమానాన్ని పెంచుకుంది. మిస్టర్ మూవీ ఫలితంతో సంబంధం లేకుండా లావణ్య, వరుణ్ తో చాలా క్లోజ్ గా ఉండటం ప్రారంభించారు. 

Advertisement

 

వరుణ తేజ్ నే పెళ్లి చేసుకుందామని అడిగాడట. అప్పటికే వరుణ్ అంటే చాలా ఇష్టం ఉన్న లావణ్య అందుకు ఒప్పుకుందట. అలా వారి మధ్య ప్రేమ మొదలైందట. ఈ విషయాన్ని బయటికీ రాకుండా ఇద్దరూ చాలా జాగ్రత్త పడ్డారట. ఇక తరువాత వీరిద్దరూ కలిసి అంతరిక్షం మూవీలో కలిసి నటించారు. వరుణ్, లావణ్యల ఎఫైర్ నిహారిక పెళ్లిలో బయటపడింది. నిహారిక పెళ్లికి మెగా ఫ్యామిలీతో పాటు రీతువర్మ, లావణ్య త్రిపాఠి కూడా హాజరయ్యారు. ఇక అప్పటి నుంచి ఆమె పై మీడియా మరింత దృష్టి సారించడం మొదలుపెట్టింది. దీంతో కేవలం మేము స్నేహితులం మాత్రమే అని చెప్పుకొచ్చారు లావణ్య. అకస్మాత్తుగా ఎంగేజ్ మెంట్ చేసుకొని అందరినీ ఆశ్ఛర్యపరిచింది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

VarunLavs : వరుణ్‌ తేజ్‌ – లావణ్య తిప్రాఠి ఎంగేజ్‌ మెంట్‌ ఫోటోలు వైరల్‌

మెగాకోడలు కాబోయే లావణ్య త్రిపాఠి ఫ్యామిలీ గురించి మీకు తెలుసా ?

 

Visitors Are Also Reading