మెగా ఫ్యామిలీకి కాబోయే కోడలు లావణ్య త్రిపాఠి గురించి అందరికీ తెలిసిందే. ఇటీవలే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఎట్టకేలకు నిన్న రాత్రి లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ఎంగేజ్ మెంట్ అయింది. వీరు శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన మిస్టర్ సినిమా సమయంలోనే ప్రేమలో పడ్డారు. కానీ చాలా రహస్యంగా మెయింటైన్ చేశారు. ఎట్టకేలకు తాజాగా ఎంగేజ్ మెంట్ కావడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరి ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు లావణ్య త్రిపాఠి ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం.
Advertisement
Ad
లావణ్య త్రిపాఠి కుటుంబం గురించి సోషల్ మీడియాలో నెటిజన్లు ఆరా తీస్తున్నారు. డిసెంబర్ 15, 1990లో జన్మించిన లావణ్య.. పుట్టింది యూపీలో అయినప్పటికీ.. ఆమె ఆ తరువాత ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో పెరిగింది. లావణ్య తండ్రి న్యాయవాదిగా కొనసాగుతున్నారు. తల్లి టీచర్ గా విధులు నిర్వహించి ఇటీవలే పదవీ విరమణ పొందారు. ఆమె అక్క ప్రస్తుతం కమిషనర్ గా పని చేస్తున్నారు. వీరితో పాటు లావణ్యకి ఓ సోదరుడు కూడా కలడు. డెహ్రాడూన్ లో పాఠశాల విద్యనభ్యసించి ఆ తరువాత ముంబయికి షిప్ట్ అయింది.
Advertisement
ఇక ఆ తరువాత ఆమె మోడలింగ్ పై ఉన్న ఇంట్రెస్ట్ తో పలు టీవీ షోలలో కనిపించింది. పాఠశాలలో చదివే సమయంలోనే 2006లో మిస్ ఉత్తరాఖండ్ టైటిల్ కైవసం చేసుకుంది. పాఠశాలలో చదివే సమయంలోనే శాస్త్రీయ నృత్యం నేర్చుకుంది. భలే భలే మగాడివోయ్ మూవీలో భరత నాట్యం కూడా చేసింది లావణ్య. తొలుత హిందీలో ప్యార్ కా బంధన్ అనే టీవీ షో ద్వారా అడుగుపెట్టింది. ఆ షో పాపులర్ కావడంతో లావణ్య క్రేజ్ కూడా పెరిగింది. టాలీవుడ్ కి అందాల రాక్షసితో ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఓ తమిళ మూవీలో నటిస్తోంది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
VarunLavs : వరుణ్ తేజ్ – లావణ్య తిప్రాఠి ఎంగేజ్ మెంట్ ఫోటోలు వైరల్
భర్తతో నిహారిక విడాకులు.. వరుణ్ ఎంగేజ్మెంట్ కు చైతూ డుమ్మా ?ః