టాలీవుడ్ సీనియర్ హీరో అయిన రాజశేఖర్ తో గరుడవేగ అనే సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్నాడు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. ఈ సినిమా కంటే ముందు కొన్ని సినిమాలను డైరెక్ట్ చేసిన ఈ సినిమా వల్లే ఆయనకు గుర్తింపు అనేది ఎక్కువగా వచ్చింది. అయితే ప్రవీణ్ సత్తారు ఇప్పుడు తాజాగా ది ఘోస్ట్ అనే సినిమాను తెరకెక్కించారు. ఇందులో నాగార్జున హీరోగా నటించారు.
Advertisement
అయితే విడుదలకు ముందు ఈ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి. అందుకే ఈ సినిమా బిజినెస్ బాగా జరిగింది. అయితే ఈ ది ఘోస్ట్ సినిమా విడుదలకు ముందే వరుణ్ తేజ్ తో ఓ సినిమా చేస్తున్నట్లు ప్రవీణ్ సత్తారు ప్రకటించారు. ఈ సినిమా పూజ కార్యక్రమాలు కూడా అయ్యాయి. కానీ తాజాగా విడుదల అయిన ది ఘోస్ట్ సినిమా అంచనాలకు విరుద్ధంగా.. యావరేజ్ టాక్ తెచ్చుకొని తక్కువ కలెక్షన్స్ అనేవి అందుకుంది.
Advertisement
అందువల్ల ఇప్పుడు ప్రవీణ్ సత్తారుతో చేయాల్సిన సినిమాపై వరుణ్ తేజ్ ఆలోచనలో పడినట్లు తెలుస్తుంది. అసలే ఈ సినిమాను వరుణ్ తేజ్ తండ్రి నాగబాబు నిర్మించబోతున్నాడు. కానీ గతంలో నాగబాబు నిర్మించిన సినిమాలు చాలా ప్లాప్ అయ్యి.. ఆయన బాగా నష్టపోయారు. కాబట్టి ఈ సినిమా విషయంలో వరుణ్ సందిగ్ధంలో పడినట్లు తెలుస్తుంది. కాబట్టి చూడాలి మరి ప్రవీణ్ సత్తారుతో సినిమా షూటింగ్ కు వరుణ్ అంగీకరిస్తాడా.. లేదా ఈ సినిమాను వదిలేస్తాడా అనేది.
Advertisement
ఇవి కూడా చదవండి :