Telugu News » Blog » హైదరాబాద్ జట్టులో సిరాజ్.. కానీ ఆడటం అనుమానమే..!

హైదరాబాద్ జట్టులో సిరాజ్.. కానీ ఆడటం అనుమానమే..!

by Manohar Reddy Mano
Ads

హైదాబాద్ నుండి భారత జట్టులో ఆడుతున్న ఆటగాళ్లలో మొహ్మద్ సిరాజ్ ఒక్కడు. అయితే ఈ నెల 11 నుండి మన దేశవాళీ టోర్నీ అయిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ప్రారంభం కాబోతుంది. ఇక ఇందులో పాల్గొనబోయే హైదాబాద్ జట్టును తాజాగా హైదాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. అయితే ఈ జట్టుకు బ్యాట్స్‌మన్ తన్మయ్ అగర్వాల్ కెప్టెన్‌గా ఎంపిక కాగా… ఐపీఎల్ లో ముంబై జట్టు తరపున బాగా రాణించిన తిలక్ వర్మ వైస్ కెప్టెన్ గా ఉండనున్నాడు.

Advertisement

అయితే ఈ జట్టులో సూరజ్ పేరును కూడా ఉండటం గమనార్హం. కానీ అతను ఈ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పాల్గొనడం అనేది అనుమానమే. ఎందుకంటే.. ప్రస్తుతం సిరాజ్ సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్ లో ఇండియా తరపున ఆడుతున్నాడు. అలాగే అతను టీ20 ప్రపంచ కప్ జట్టులో కూడా ఉండే అవకాశం అనేది ఉంది.

Advertisement

గాయం కారణంగా తప్పుకున్న బుమ్రా.. స్థానంలో బీసీసీఐ ఇంకా ఎవరిని ఎంపిక చేయలేదు. కానీ ఆ స్థానం కోసం వినిపిస్తున్న పేర్లలో సిరాజ్ పేరు కూడా ఉంది. కానీ అతనికి షమీ పోటీగా ఉన్నాడు. అయితే ఒకవేళ సిరాజ్ నే బీసీసీఐ సెలక్టర్లు ప్రపంచ కప్ కోసం ఎంపిక చేస్తే.. అతను సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పాల్గొన్నాడు. కానీ అతను ఎంపిక కాకపోతే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ తరపున ఆడుతాడు.

Advertisement

ఇవి కూడా చదవండి :

పంత్ ఏ పాత్రకు పనికిరాడు..!

సాహా ఫుడ్ కాంబినేషన్ ఓ వింత అంటున్న కోహ్లీ..!

You may also like