Home » Upasana : మదర్స్ డే రోజున బేబీ బంప్ తో ఉపాసన… ఫోటో వైరల్

Upasana : మదర్స్ డే రోజున బేబీ బంప్ తో ఉపాసన… ఫోటో వైరల్

by Bunty

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ ఫ్యామిలీకి ఎంత గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. బెస్ట్ కపుల్స్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఒకరు. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ హీరోగా ఎదిగిపోయారు. మరోవైపు బిజినెస్ ఉమెన్ గా ఉపాసన సక్సెస్ సాధించారు. ఈ దంపతులు పదేళ్ల కిందటే పెళ్లి చేసుకున్నారు.

త్వరలోనే వీరు తల్లిదండ్రులుగా మారబోతున్నారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఉపాసన సీమంతం గ్రాండ్ గా జరిగింది. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, ఉపాసన మరికొన్ని నెలల్లో పాపకు జన్మనివ్వనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మదర్స్ డే సందర్భంగా ఆమె ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ లో రాస్తూ… తాను అన్ని మంచి కారణాల కోసమే మాతృత్వాన్ని స్వీకరిస్తున్నాను.

దానికి ఎంతో గర్వపడుతున్నాను. నా బిడ్డ కోసం నా సర్వస్వ ప్రేమను అందించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు ఉపాసన బేబీ బంప్ ఫోటో కూడా వైరల్ గా మారింది. కాగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణిగానే కాకుండా అపోలో ఆసుపత్రిల అధినేత మనవరాలిగా ఉపాసనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సామాజిక స్పృహ ఉన్న మహిళగా, వ్యాపారవేత్తగా తన సత్తా చాటుతోంది.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Suryakumar Yadav : సూర్య బ్యాటింగ్ చూసి సచిన్ షాక్… వీడియో వైరల్

సమంతను గట్టిగా హాగ్ చేసుకున్న విజయ్ దేవరకొండ…!

 Iswarya Lakshmi : యువితో ఐశ్వర్య లక్ష్మి ఎఫైర్?

Visitors Are Also Reading