Home » Suryakumar Yadav : సూర్య బ్యాటింగ్ చూసి సచిన్ షాక్… వీడియో వైరల్

Suryakumar Yadav : సూర్య బ్యాటింగ్ చూసి సచిన్ షాక్… వీడియో వైరల్

by Bunty
Ad

ఐపీఎల్ 2023లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్లో గుజరాత్ పై ముంబై విజయం సాధించింది. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ ధనాధన్ బ్యాటింగ్ తో అలరించాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ బౌలర్లను చీల్చి చెండాడి మెరుపు సెంచరీ సాధించాడు. ఇన్నింగ్స్ ఆఖరి బంతిని సిక్స్ గా మలిచిన సూర్య ఐపిఎల్ లో తొలి సెంచరీ నమోదు చేశాడు.

READ ALSO : ఒంటరిగా గెలువలేను.. కచ్చితంగా పొత్తులు పెట్టుకుంటా !

Advertisement

మొత్తంగా 49 బంతులు ఎదుర్కొన్న సూర్య 11 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 103 పరుగులు చేశాడు. అచ్చం క్రికెట్ గేమ్ బ్యాటింగ్ తరహాలో సూర్య ఇన్నింగ్స్ కొనసాగడం గమనార్హం. సూర్య దాటికి 16 ఏళ్ల ఐపీఎల్ రికార్డు కూడా బద్దలైంది. అయితే… నిన్నటి మ్యాచ్ లో ముంబై బ్యాటింగ్ 18.1 ఓవర్స్ సందర్భంగా షమీ బౌలింగ్ చేశాడు. అప్పటికే 40 బంతుల్లో 73 రన్స్ తో ఉన్న సూర్య తన గేర్ మార్చి రెడీగా ఉన్నాడు.

Advertisement

READ ALSO : పూరిని వీడని “లైగర్” చిక్కులు.. ఫిల్మ్‌చాంబర్‌ ఎదుట ఎగ్జిబిటర్ల ఆందోళన

Suryakumar Yadav Six to Shami Impress Sachin Tendulkar; Surya's thunderous six to Mohammed Shami, Sachin can'

షమీ వేసిన బంతిని చాలా నీట్ గా స్లైస్ చేశాడు. దీంతో అది కాస్త స్టాండ్స్ పడింది. సిక్స్ అయింది. అయితే ఈ షార్ట్ చూసి స్టేడియంలో ఉన్నవాళ్ళకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇక సచిన్ కూడా ఇలా కట్ చేశాడు! అనేలా చేతులతో చూపిస్తూ కనిపించారు. ఆ వీడియో ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. సచిన్ నుంచి రియాక్షన్ అసలు ఊహించలేదని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.

READ ALSO : నాగ చైతన్యకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నాగార్జున ?

Visitors Are Also Reading