Home » ప్రియున్ని హత్య చేయించిన శ్వేతా కేసులో అనుకోని ట్విస్ట్.. ఆ మెసేజ్ చూసి ఉంటే..!!

ప్రియున్ని హత్య చేయించిన శ్వేతా కేసులో అనుకోని ట్విస్ట్.. ఆ మెసేజ్ చూసి ఉంటే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం టెక్నాలజీ పెరిగి మనం ఏది కావాలన్నా అరచేతిలో అరక్షణంలో తెలుసుకోగలుగుతాం. అలాంటి టెక్నాలజీని మంచి కోసం వాడితే మంచిదే. కానీ చెడు వ్యవహారాలకోసం వాడితే అది కత్తి కంటే పదునైనది అని మర్చిపోవద్దు. యశ్విన్, శ్వేత వ్యవహారంలో కూడా ఇదే జరిగింది.. వారి ఫేస్ బుక్ పరిచయం అక్రమ సంబంధంగా మారింది. పోలీసుల దర్యాప్తులో సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి.. హైదరాబాదులోని మీర్ పేట్ లో యశ్విన్ పై దాడి జరిగ్గా చికిత్స పొందుతూ హాస్పటల్లో మృతి చెందాడు యశ్విన్.. ప్రియుడిని చంపించిన కేసులో మరో ట్విస్ట్ బయటపడింది. ముందుగా ప్రియుడిని హత్య చేయించాలని పథకం వేసి శ్వేతా రెడ్డి చివరి నిమిషంలో హత్య చేయవద్దని మరొక ప్రియుడు అశోక్ కు పంపినట్లు సమాచారం. కానీ అప్పటికే యశ్విన్ ను తీవ్రంగా కొట్టి గాయపరిచారు. తల వెనుక భాగం నుంచి కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడని, మతిస్థిమితం కోల్పోయాడని నిందితులు పోలీసుల ఎదుట ఒప్పుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఈ హత్యను యాక్సిడెంట్ లాగా చిత్రీకరించారు. కానీ పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా యశ్విన్ యొక్క కాల్ డేటా తో కూపీ లాగారు. ఆయన ఎవరికి ఫోన్ చేశారు అనేది చూస్తే శ్వేతా రెడ్డి నెంబరు పట్టుబడింది. దీంతో శ్వేతా ను అదుపులోకి తీసుకొని విచారిస్తే తతంగం అంతా బయటికి వచ్చింది. ఈ ఎపిసోడ్ లో అశోక్ మరియు కార్తీక్ ఎవరు.. శ్వేత తో వాళ్లకి ఏంటి లింక్..? అనే కోణంలో పోలీసులు పూర్తి వివరాలు తెలియజేశారు. అశోక్ ది కృష్ణాజిల్లా తిరువూరు మండలం. అతను బ్యాంకు లో ఉద్యోగం చేస్తాడు. బ్యాంకులో ఆయన పనులు ఏమో కానీ ఈ కేసులో కూపీ లాగితే భామాకలాపం తెరపైకి వచ్చింది. అశోక్ మరియు శ్వేతా రెడ్డి కి ఫేస్ బుక్ లోనే పరిచయం అది కూడా నాలుగైదు నెలల క్రితం నుంచే. ఈ పరిచయం కాస్త యశ్విన్ ను హత్య చేసే వరకు వెళ్ళింది. అయితే ఈ కేసు దర్యాప్తులో పోలీసులు వెల్లడించిన వివరాల కూపి లాగే కొద్ది సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. దీన్ని పోలీసులు చాలా లోతుగా వెళ్లి విచారిస్తున్నారు. నిందితురాలిగా ఉన్నటువంటి శ్వేతా రెడ్డి, కార్తీక్,అశోక్ లను అదుపులోకి తీసుకున్నారు. అసలు ఈ మర్డర్ కేసులో నిజాలు ఏంటి..? ఎవరి పాత్ర ఏంటి..? ఇంకేన్ని విషయాలు బయటకు రానున్నాయో సస్పెన్స్ గా మారింది.

Advertisement

ALSO READ;

Advertisement

మహేష్ బాబు రిజెక్టు చేసిన ఈ మూవీస్ సూపర్ హిట్ అయ్యాయి.. ఏంటంటే..!!

ఇప్పటికీ మీతోనే అన్నా అంటూ సీఎం జగన్ పాత ఫోటో షేర్ చేసిన శ్రీరెడ్డి…నెట్టింట వైరల్…!

 

Visitors Are Also Reading