Home » ఇప్పటికీ మీతోనే అన్నా అంటూ సీఎం జగన్ పాత ఫోటో షేర్ చేసిన శ్రీరెడ్డి…నెట్టింట వైరల్…!

ఇప్పటికీ మీతోనే అన్నా అంటూ సీఎం జగన్ పాత ఫోటో షేర్ చేసిన శ్రీరెడ్డి…నెట్టింట వైరల్…!

by AJAY
Ad

వివాదాస్పద నటి శ్రీరెడ్డి పరిచయం అక్కర్లేని పేరు. శ్రీరెడ్డి ఎప్పుడు ఏదో ఒక టాపిక్ తో వార్తల్లో నిలుస్తుంది.పేరుకు సినిమా నటి అయినా కూడా రాజకీయ, సామాజిక అంశాలపై వీడియో లు చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. ముఖ్యంగా శ్రీ రెడ్డి కి సినిమాలలో మరియు రాజకీయాల్లో కొంత మంది ఇష్టమైన వాళ్ళు ఉన్నారు.

Srireddy

Srireddy

వాళ్లను పొగుడుతూ నచ్చని వాళ్ళని తిడుతూ ఉంటుంది. ఏపీలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ పై శ్రీ రెడ్డి విమర్శలు కురిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఏపీ సీఎం జగన్ అంటే తనకు ఎంతో ఇష్టమని అన్న తో సమానం అని చెబుతోంది. సీఎం జగన్ పాలనను శ్రీరెడ్డి ఎప్పుడూ కొనియాడుతూ ఉంటుంది.

Advertisement

Advertisement

అంతే కాకుండా తన వీడియోలలో వైసిపి పార్టీ తరఫున ప్రచారం కూడా చేస్తుంది. అయితే తాజాగా శ్రీ రెడ్డి సీఎం జగన్ పాత ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోకు ….ఇప్పటికీ నీతోనే అన్నా అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అయితే ఆ ఫోటోలో సీఎం జగన్ పక్కన ఉన్నది ఎవరు అనేది మాత్రం తెలియడం లేదు.

ఇక ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది ఇలా ఉంటే శ్రీ రెడ్డి గత కొంత కాలంగా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వంటల వీడియోలు చేస్తుంది. ఈ వీడియోలలో వంటల తో పాటూ అందాల ప్రదర్శన కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. దాంతో నెటిజన్లు తమదైన స్టైల్ లో కామెంట్స్ పెడుతున్నారు.

Visitors Are Also Reading