Home » మహేష్ బాబు రిజెక్టు చేసిన ఈ మూవీస్ సూపర్ హిట్ అయ్యాయి.. ఏంటంటే..!!

మహేష్ బాబు రిజెక్టు చేసిన ఈ మూవీస్ సూపర్ హిట్ అయ్యాయి.. ఏంటంటే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

మహేష్ బాబు ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నా స్టార్ హీరో. తాజాగా ఆయన సినిమా సర్కార్ వారి పాట బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కొట్టిందని చెప్పవచ్చు. అయితే మహేష్ బాబు ఎప్పుడైనా సరే కథల విషయంలో చాలా క్లారిటీ గా ఉంటారట. నచ్చితే ఓకే చెప్తారట.. అంతేకానీ కథలోకి దూరి వాటిని మార్చడం అలాంటి ఇలాంటి పనులు అస్సలు చేయరని సమాచారం. ఆయన దర్శకుడు ఏం చెబితే అది చేసుకుంటూ వెళ్లి పోతారట. ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్న మహేష్ బాబు ఈ సూపర్ హిట్ సినిమాలను ఎందుకు వదులుకున్నాడు. ఆ సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం..??పుష్ప: రీసెంట్ గా బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టిన మూవీ పుష్ప. ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరు మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్ కు ఈ సినిమా సెట్ కాదని అంటారు. కానీ సుకుమార్ ఈ కథ చెప్పినప్పుడు మహేష్ ని చేయమని ఎంత చెప్పినా దాన్ని మాత్రం సున్నితంగా తిరస్కరించారు. ఎందుకంటే మహేష్ వన్ నేనొక్కడినే సినిమాతో బోల్తా పడ్డాడు కాబట్టి ఆ భయం పట్టుకుంది అనుకోవచ్చు. అందుకే ఈ సినిమాను తిరస్కరించారని తెలుస్తోంది.గజిని : మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన సినిమా గజిని. ఈ మూవీ కథను చాలామంది హీరోలకు చెప్పాడు. ఆ లిస్టులో మహేష్ బాబు కూడా ఉన్నాడు. అయితే చాలా మంది అభిమానులు మహేష్ బాబు గ్లామర్ ను చూసి ఇష్టపడతారని, ఈ గుండు ప్రయోగం నేను చేయనని నో చెప్పేశారట.వర్షం : ప్రభాస్ కెరీర్ లోనే తిరుగులేని విజయం అందుకున్న సినిమా వర్షం.. ఈ కథ కూడా ముందుగా మహేష్ బాబు దగ్గరికి వచ్చిందట. అయితే ఈ పాత్ర నాకు కరెక్ట్ కాదని మహేష్ బాబు వదిలేశారట.

Advertisement

ALSO READ;

Advertisement

సర్కారు వారి పాట సినిమాలో భీమ్లా నాయక్ రింగ్ టోన్ వెనక ఇంత కథ ఉందా…!

టాలీవుడ్ లో గొప్ప మనసున్న 6గురు స్టార్లు…వాళ్ళు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంటో తెలుసా..!

 

Visitors Are Also Reading