Home » Barrelakka: గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్, బ్యాచిలర్స్ పార్టీ..!

Barrelakka: గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్, బ్యాచిలర్స్ పార్టీ..!

by Sravya
Ad

బర్రెలక్క గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. బర్రెలక్క ఎన్నికల్లో నిలబడి అందరికీ దగ్గరయింది. బర్రెలక్క కేవలం పేరు కాదు బ్రాండ్ అన్న విధంగా మారిపోయింది. ఒక ఇంస్టాగ్రామ్ రీల్ తో మొత్తం తెలంగాణని ఊపు ఊపేసింది. టైం పాస్ కోసం చేసిన ఒక వీడియో తన జీవితాన్ని మార్చింది. వైరల్ అయిన వీడియోతో జనాలు పిలిచిన పేరుని తన పేరుగా మార్చుకుంది సెలబ్రిటీ అయిపోయింది. అక్కడితో ఆగకుండా ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి సంచలనాన్ని సృష్టించింది. నిరుద్యోగుల కోసమే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని నిరుద్యోగులకి ఉత్తేజాన్ని ఇచ్చింది. రోజు షాట్ షార్ట్ రీల్స్ చూస్తూ టైంపాస్ చేసే యువతని ఆలోచించేలా చేసింది.

barrelakka-pre-weddin-shoot

Advertisement

 

సోషల్ మీడియా ని తన వైపు తిప్పుకుంది. మేధావి వర్గాన్ని కూడా ఒక అడుగు ముందుకు వేసేలా సపోర్ట్ ఇచ్చేలా ప్రభావితం చేసింది. కొల్లాపూర్ నియోజక వర్గం నుండి బరిలోకి దిగిన బర్రెలక్క ఓడిపోయిందా గెలిచిందా అనేది ముఖ్యం కాదు. ఆమె చాలామందికి ఆదర్శంగా నిలిచింది. మహబూబ్నగర్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలానికి చెందిన మరికల్ గ్రామానికి చెందిన ఒక నిరుపేద ఈమె. ఎటువంటి సపోర్ట్ లేకుండా తాను దిగుతున్న రంగం ఎంత లోతు ఉంటుందో ఆమె తెలుసుకుంది. కేవలం తన ఆత్మస్థైర్యాన్ని మాత్రమే నమ్ముకుని గుండె ధైర్యంతో వచ్చింది.

Advertisement

Also read:

ఎన్నో మెదడులని కదిలించింది. బర్రెలక్క అలియాస్ శిరీష తెలంగాణ రాజకీయంలోనే కాకుండా ఏపీలో కూడా దుమారం రేపుతోంది. ఇప్పుడు ఈమె పెళ్లి చేసుకోబోతోంది స్వయంగా ఈమె తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. పెళ్లి చూపుల నుండి మొదలు పూలదండ్రులు షాపింగ్ మేకప్ బ్యాచిలర్ పార్టీ ఇలా అన్ని వీడియోలను కూడా పోస్ట్ చేసింది. తన సోషల్ మీడియా ఫాలోవర్స్ అలానే శ్రేయోభిలాషులకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ని ఇస్తోంది బర్రెలక్క. ఈమె పెళ్లి వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. అలానే వరుడు ఎవరని అందరూ ఆరా తీయడం కూడా మొదలుపెట్టారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading