Home » IPL 2023 : షారుఖ్‌ ఖాన్, విరాట్ కోహ్లీ మధ్య ట్విట్టర్ వార్.. !

IPL 2023 : షారుఖ్‌ ఖాన్, విరాట్ కోహ్లీ మధ్య ట్విట్టర్ వార్.. !

by Bunty
Ad

ఇవాల్టి నుంచి ఐపీఎల్ మ్యాచ్ లు ప్రారంభం కాబోతున్నాయి. క్రికెట్ అభిమానులకు ఇక సందడే సందడి. రెండు నెలల పాటు కాలాక్షపానికి డోకా లేదు. అద్భుతమైన క్యాచ్ లు, తక్కువ బాల్స్ లోనే సెంచరీలు, అత్యధిక స్కోరు నమోదు చేయడం, చివరి బంతి వరకు ఉత్కంఠ… ఇక సూపర్ ఓవర్ అంటూ క్రికెట్ ఫ్యాన్స్ కు టెన్షన్ తప్పదు. చివరి బాల్ వరకు ప్రతి మ్యాచ్ ఉత్కంఠ రేపుతుంది.

READ ALSO : RC 15 : ‘గేమ్ చేంజర్’ గా రామ్ చరణ్… ఆ టైటిల్ పెట్టడానికి కారణం ఇదే!

Advertisement

ఈ నేపథ్యంలోనే.. విరాట్ కోహ్లీ-షారుక్ ఖాన్ ఫ్యాన్స్ మధ్య ట్విట్టర్ లో వార్ కొనసాగుతోంది. విరాట్ కంటే షారుక్ గొప్ప అని షారుక్ ఖాన్ ఫ్యాన్స్ అంటుంటే, షారుక్ కన్నా మావాడు తోపు అని కోహ్లీ అభిమానులు అంటున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరి అభిమానుల మధ్య చిన్నపాటి యుద్దమే జరుగుతోంది.

Advertisement

Shah Rukh Khan and Virat Kohli's fans engage in war of words on Twitter ahead of IPL 2023; here's why

విరాట్ కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్సిబి ఒక్క టైటిల్ కూడా గెలవలేదని అభిమానులు అనగా, వరల్డ్ లో ఉత్తమ నటుడు ఎవరు అని వెతికితే షారుఖ్ పేరు రావడం లేదు కానీ, బెస్ట్ క్రికెటర్ ఎవరు అని సెర్చ్ చేస్తే విరాట్ కోహ్లీ పేరు వస్తుంది అని కౌంటర్ ఇచ్చారు విరాట్ ఫ్యాన్స్. అదికాక షారుక్ కు సంబంధించిన ఓ ఐకానిక్ సినిమా షాట్ షేర్ చేస్తూ కోహ్లీ లైఫ్ మొత్తం ఒక్క ఎంట్రీ సీన్ కు సాటిరాదు అంటూ కోహ్లీ ఫ్యాన్స్ కు సవాల్ విసిరారు. దాంతో విరాట్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు అంటూ విరాట్ ఫ్యాన్స్ చెప్పుకొచ్చారు. ఇలా వారు ట్విట్టర్ లో పడుతున్న గొడవ వైరల్ గా మారింది. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

READ ALSO : TS Constable : ఏప్రిల్‌ 2న పోలీస్‌ కానిస్టేబుల్‌ తుది రాతపరీక్ష..కచ్చితంగా ఈ రూల్స్ పాటించండి

Visitors Are Also Reading