Home » TS Constable : ఏప్రిల్‌ 2న పోలీస్‌ కానిస్టేబుల్‌ తుది రాతపరీక్ష..కచ్చితంగా ఈ రూల్స్ పాటించండి

TS Constable : ఏప్రిల్‌ 2న పోలీస్‌ కానిస్టేబుల్‌ తుది రాతపరీక్ష..కచ్చితంగా ఈ రూల్స్ పాటించండి

by Bunty
Ad

తెలంగాణ పోలీస్‌ కానిస్టేబుల్‌ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.  తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్స్ స్థాయి పోస్టులకు తుది రాత పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సాంకేతిక విభాగానికి సంబంధించి పోలీసు రవాణా సంస్థలో డ్రైవర్, మెకానిక్, అగ్నిమాపక శాఖలో డ్రైవర్ ఆపరేటర్ కానిస్టేబుల్ అభ్యర్థులకు తుదిరాత పరీక్షను హైదరాబాద్ కేంద్రంలో నిర్వహించనున్నారు.

READ ALSO :  Nidhhi Agerwal – Venu Swamy: నిధి అగర్వాల్ ఇంట్లో వేణు స్వామి పూజలు.. ఇదిగో వీడియో!

Advertisement

ఏప్రిల్ 2వ తేదీన మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 5:30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మంగళవారం ప్రకటించింది. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు కూడా విడుదల చేసింది. తుదిరాత పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Advertisement

పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు మంగళవారం రాత్రి నుంచి 31 వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని చైర్మన్ వివి శ్రీనివాసరావు ఓ ప్రకటనలో వివరించారు. హాల్ టికెట్ల డౌన్లోడ్ లో ఇబ్బందులు ఉంటే 93937 11110 లేదా 93910 05006 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని సూచించారు. డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్ పై తప్పనిసరిగా ఫోటోను అతికించి పరీక్షకు హాజరు కావాలని, లేని పక్షంలో దాన్ని పరిగణలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు.

read also : Naga Chaitanya : శోభితతో నాగచైతన్య డేటింగ్… ఒకే రూమ్ లో అడ్డంగా దొరికిపోయారుగా!

Visitors Are Also Reading