Home » ఆదిపురుష్ అనుకుంటే శ‌క్తి సినిమా తీశారు అంటూ పోస్ట‌ర్ పై ట్రోల్స్…!

ఆదిపురుష్ అనుకుంటే శ‌క్తి సినిమా తీశారు అంటూ పోస్ట‌ర్ పై ట్రోల్స్…!

by AJAY
Published: Last Updated on
Ad

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ వ‌రుస సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం స‌లార్ తో పాటూ ఆదిపురుష్ సినిమాలో న‌టిస్తున్నాడు. స‌లార్ తో పాటూ ఆదిపురుష్ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ సినిమాలో ప్ర‌భాస్ కు జోడీగా కృతి స‌న‌న్ న‌టిస్తోంది. ప్ర‌భాస్ రాముడి పాత్ర‌లో న‌టిస్తుండ‌గా కృతి స‌న‌న్ సీత పాత్ర‌లో న‌టిస్తోంది. ఇక ఈ సినిమాకు ఓంరౌత్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.
Also Read: గాడ్‌ఫాద‌ర్‌లో మ‌రో స్టార్ హీరో.. సీక్రెట్ రివీల్ చేసిన స‌ల్మాన్ ఖాన్‌..!

Advertisement

భారీ బ‌డ్జెట్ తో భారీ రేంజ్ విజువ‌ల్ ఎఫెక్ట్స్ తో ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. దాంతో ఈ సినిమా పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇక తాజాగా ఆదిపురుష్ సినిమా నుండి పోస్ట‌ర్ తో పాటూ టీజ‌ర్ ను విడుద‌ల చేశారు. ఈ సినిమా పోస్ట‌ర్ లో ప్ర‌భాస్ రాముడి లుక్ లో క‌నిపిస్తున్నాడు.

Advertisement

అయితే ఈ సినిమా పోస్ట‌ర్ పై నెట్టింట ట్రోల్స్ వ‌స్తున్నాయి. గతంలో ఎన్టీఆర్ హీరోగా శ‌క్తి సినిమా వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా సోషియో ఫాంట‌సీ నేప‌థ్యంలో తెర‌కెక్కింది. అంతే కాకుండా వైజయంతీ మూవీస్ బ్యానర్ పై భారీ బ‌డ్జెట్ తో ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఇక ఈ సినిమాలోనూ గ్రాఫిక్స్ ఎక్కువ‌గానే వాడారు. కానీ ఈ సినిమా మాత్రం అంచ‌నాల‌ను రీచ్ అవ్వ‌లేక‌పోయింది.

రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ సినిమా ప్ర‌మోష‌న్స్ లో శ‌క్తి సినిమాకు సంబంధించి యాంక‌ర్ ప్ర‌శ్నించ‌గా ఆ సినిమా గురించి మ‌ర్చిపోవాలి అంటూ న‌వ్వేసాడు. అంటే ఆ సినిమా ఏ రేంజ్ డిజాస్ట‌ర్ అయ్యిందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇదిలా ఉంటే ఇప్పుడు అలాంటి డిజాస్ట‌ర్ సినిమాతో ప్ర‌భాస్ ఆదిపురుష్ సినిమా పోస్ట‌ర్ ను పోలుస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. దానికి సంబంధించిన మీమ్స్ నెట్టింట ద‌ర్శనం ఇస్తున్నాయి. అంతే కాకుండా ప్ర‌భాస్ రాముడి గెట‌ప్ సరిగ్గా లేద‌ని పోస్ట‌ర్ లో గ్రాఫిక్స్ కూడా స‌రిగ్గా లేద‌ని నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు.
Also Read: ఆదిపురుష్ సినిమాకి హిందీలో ప్ర‌భాస్‌కి వాయిస్ ఇచ్చింది ఎవ‌రో తెలుసా..?

Visitors Are Also Reading