Home » గాడ్‌ఫాద‌ర్‌లో మ‌రో స్టార్ హీరో.. సీక్రెట్ రివీల్ చేసిన స‌ల్మాన్ ఖాన్‌..!

గాడ్‌ఫాద‌ర్‌లో మ‌రో స్టార్ హీరో.. సీక్రెట్ రివీల్ చేసిన స‌ల్మాన్ ఖాన్‌..!

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి ఇటీవ‌ల ఆచార్య సినిమాతో కాస్త నిరాశ ప‌రిచిన విష‌యం తెలిసిందే. ఇక గాడ్ ఫాద‌ర్ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అక్టోబ‌ర్ 05న ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రం ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా చిరంజీవి, స‌ల్మాన్ పాల్గొన్నారు. వేదిక‌పై ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించారు స‌ల్మాన్ ఖాన్‌.


ముఖ్యంగా గాడ్ ఫాద‌ర్ సినిమాలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అతిథి పాత్ర పోషించార‌ని, ఆయ‌న‌ను తెర‌పై చూసేందుకు తాము కూడా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నామ‌ని చెప్పుకొచ్చారు. మీతో క‌లిసి న‌టించాల‌ని ఉందంటూ రామ్ చ‌ర‌ణ్ ఒక రోజు త‌న మ‌నులో మాట చెప్పారు. జోక్ చేస్తున్నాడేమో అనుకున్నాను. కానీ ఆ మ‌రుస‌టి రోజే చ‌ర‌ణ్ త‌న క్యాస్టూమ్స్ తీసుకొని సెట్‌కి వ‌చ్చాడని స‌ల్మాన్ వెల్ల‌డించాడు. గాడ్ ఫాద‌ర్ సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్ల‌పై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Advertisement

Advertisement

Also Read :  ఆదిపురుష్ అనుకుంటే శ‌క్తి సినిమా తీశారు అంటూ పోస్ట‌ర్ పై ట్రోల్స్…!

 

ఈ సినిమాలో న‌య‌న‌తార‌, స‌ల్మాన్ ఖాన్ లాంటి భారీ తారాగ‌ణం భాగం అయ్యారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ చిత్రం పోస్ట‌ర్స్‌, టీజ‌ర్, ట్రైల‌ర్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. మ‌ల‌యాళ చిత్రం లూసిఫ‌ర్ తెలుగు రీమేక్ గా భారీ హంగులు జోడించి ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ చిత్రానికి మోన్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇక ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం అక్టోబ‌ర్ 05 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

Also Read :  చిరంజీవి కోసం హీరో కృష్ణ అంతటి త్యాగం చేశారా..దీంతో చిరంజీవి జాతకమే మారింది..!!

Visitors Are Also Reading