Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త..!

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త..!

by Anji

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Today rashi phalau in telugu 05.11.2022: మేషం

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఎలాంటి పరిస్థితిల్లోనైనా మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలి. తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది.

Today rashi phalau in telugu: వృషభం 

ప్రారంభించిన కార్యక్రమాలను తోటివారి సహకారంతో పూర్తి చేస్తారు. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను పొందుతారు.

Today rashi phalau in telugu: మిథునం

ఆయా రంగాల్లో మీ పరిధిని మించి వెళ్లకండి. మీకు ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త. తోటివారి సూచనలను పాటించడం ఉత్తమం. వ్యాపార రంగంలో మీ ఆలోచనలను ఎదుటివారితో పంచుకోవడం వల్ల సాధ్య, అసాధ్య విషయాలను అంచనా వేయవచ్చు.

Today rashi phalau in telugu : కర్కాటకం

చేపట్టే పనిలో శ్రమ పెరిగినా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో తోటివారిని కలుపుకొని పోవాలి. అనవసర విషయాల గురించి సమయాన్ని వృధా చేసుకోకండి.

Today rashi phalau in telugu : సింహం

మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా మంచి ఫలితాలున్నాయి. మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. సత్కాలక్షేపంతో కాలం ఆనందంగా గడుస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

Today rashi phalau in telugu : కన్య

ప్రయత్న కార్యసిద్ధి ఉంది. మీదైనా రంగంలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. బంధు, మిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలను పాల్గొంటారు.

Today rashi phalau in telugu : తుల

ప్రారంభించబోయే పనుల్లో కాలానుగుణంగా ముందుకు సాగండి. మంచి జరుగుతుంది. నూతన వస్తువులను సేకరిస్తారు. అనవసర ఖర్చులను అదుపులో ఉంచండి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ప్రారంభించిన పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటికి అధిగమించే ప్రయత్నం చేస్తారు. మనోబలంతో ముందుకు సాగాలి. ఒకవార్త మనస్థాపానికి గురిచేస్తుంది. ఆరోగ్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి.

Today rashi phalau in telugu : ధనుస్సు

ఉత్సాహం తగ్గకుండా పని చేయాలి. అయిన వారితో జాగ్రత్త. గిట్టని వారు తప్పుదోవ పట్టిస్తారు. చిన్న చిన్న అంశాలను పెద్దవి చేసుకోవడం మంచిది కాదు.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

మానసికంగా దృఢంగా ఉంటారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు, మిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అధికారుల సహాయ, సహకారాలు అందుతాయి.

Today rashi phalau in telugu : కుంభం

మీ మీ రంగాల్లో శ్రమ పెరిగినప్పటికీ పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. బంధు, మిత్రుల సహకారం ఉంటుంది. మనశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu :  మీనం

ప్రయత్నాలు ఫలిస్తాయి. బుద్ధిబలంతో పనులను పూర్తి చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారంలో ముందడుగు వేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

Visitors Are Also Reading