Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంటారు

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంటారు

by Anji
Ad

ప్రతిరోజు ఉదయం  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకోవ‌చ్చు. ఈరోజు  ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Advertisement

Today rashi phalau in telugu 05.06.2022: మేషం

 

శ్ర‌మ‌తో కూడిన ఫ‌లితాలు ఉన్నాయి. ప‌క్క వారిని క‌లుపుకొని పోవ‌డం వ‌ల్ల ఇబ్బందులు త‌గ్గుతాయి. మ‌నోబ‌లం త‌గ్గ‌కుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu: వృషభం 

మంచి ప‌నులు చేప‌డుతారు. గొప్ప‌వారితో స‌త్సాంగ‌త్యం ఏర్ప‌డుతుంది. కీల‌క విష‌యాల్లో పురోగ‌తి ఉంటుంది. ఖ‌ర్చులు పెర‌గ‌కుండా చూసుకోవాలి. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త‌లు అవ‌స‌రం.

Today rashi phalau in telugu: మిథునం

భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌లో స్ప‌ష్ట‌త వ‌స్తుంది. తోటివారితో క‌లిసి శుభ‌కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ఆదాయానికి త‌గ్గ వ్య‌యం ఉంటుంది. ప్ర‌యాణాలు ఫ‌లిస్తాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం

వృత్తి, ఉద్యోగ‌, వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. ఓ వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధు, మిత్రుల‌తో క‌లిసి శుభ‌కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు. కొన్ని సంఘ‌ట‌న‌లు మిమ్మ‌ల్ని ఉత్సాహ‌ప‌రుస్తాయి.

Today rashi phalau in telugu : సింహం

కృషికి త‌గ్గ ఫ‌లితాలున్నాయి. కీల‌క వ్య‌వ‌హారాల్లో కుటుంబ స‌హ‌కారం అందుతుంది. బంధుప్రీతి క‌ల‌దు.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

మాన‌సిక ప్ర‌శాంత‌త ఉంటుంది. ప్రారంభించిన ప‌నిలో ఆత్మీయుల స‌హ‌కారం అందుతుంది. బంధువుల‌తో మేలు జ‌రుగుతుంది. ఆధ్యాత్మిక విష‌యాల్లో చురుకుగా పాల్గొంటారు.

Today rashi phalau in telugu : తుల

ల‌క్ష్యంపై ఏకాగ్ర‌త త‌గ్గ‌కుండా చూసుకోవాలి. కొన్ని సంద‌ర్భాల్లో నిపుణుల స‌ల‌హాలు అవ‌స‌రం అవుతాయి. ఉద్యోగంలో మీపై అధికారుల స‌హ‌కారం ఉంటుంది. సొంత నిర్ణ‌యాలు ప‌ని చేస్తాయి. మీ నిబ‌ద్ధ‌తే మిమ్మ‌ల్ని ఉన్న‌తుల్ని చేస్తుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ఒక కీల‌క‌మైన ప‌నిని ఎట్ట‌కేల‌కు పూర్తి చేస్తారు. ఉద్యోగ‌, వ్యాపారాల్లో మిశ్ర‌మ ఫ‌లితాలున్నాయి. ఒక‌వార్త బాధ క‌లిగిస్తుంది. కొన్ని సంఘ‌ట‌న‌లు నిరుత్సాహ ప‌రుస్తాయి. ప్ర‌శాంత చిత్తంతో ముందుకు సాగితే అన్ని స‌ర్దుకుంటాయి.

Today rashi phalau in telugu : ధనస్సు

అనుకున్న‌ది సాధించే దిశ‌గా ప‌య‌నిస్తారు. కుటుంబ స‌భ్యుల సంపూర్ణ స‌హ‌కారం ల‌భిస్తుంది. ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంటుంది. స‌మ‌యానికి నిద్ర‌హారాలు తీసుకోవాలి. ఓ శుభ‌వార్త మీ ఆత్మ‌విశ్వాసాన్ని పెంచుతుంది.

Today rashi phalau in telugu : మ‌క‌రం

మీ అభివృద్ధికి దోహ‌ద‌ప‌డే ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంటారు. స్థిర‌మైన బుద్ధితో ముందుకు సాగండి. కుటుంబంలో స‌మ‌స్య‌లు రాకుండా జాగ్ర‌త్త ప‌డాలి.

Today rashi phalau in telugu : కుంభం

ఓ శుభ‌వార్త ఆనందాన్ని క‌లిగిస్తుంది. గిట్ట‌నివారి జోలికి పోకుండా ఉండ‌డం మంచిది. ప్ర‌యాణాలు అనుకూలిస్తాయి.

Today rashi phalau in telugu :  మీనం

శ్ర‌ద్ధ‌తో ప‌ని చేయాలి. త‌రుచూ నిర్ణ‌యాలు మారుస్తూ ఇబ్బందులు ప‌డ‌తారు. బందువుల‌తో మాట ప‌ట్టింపులకు పోరాదు. ఆరోగ్యంపై శ్ర‌ద్ధ అవ‌స‌రం. అధికారుల‌తో కాస్త అప్ర‌మ‌త్తంగా ఉండాలి.

Visitors Are Also Reading