Telugu News » Today rasi phalalu in telugu : ఆ రాశి వారికి పెళ్లి సంబంధం కుదురుతుంది

Today rasi phalalu in telugu : ఆ రాశి వారికి పెళ్లి సంబంధం కుదురుతుంది

by Anji

రాశి ఫ‌లాలు చ‌ద‌వ‌డం మీ భ‌విష్య‌త్‌ను అంచ‌నా వేయాడానికి సుల‌భ‌మ‌మైన మార్గాల‌లో ఒక‌టి. మీ భ‌విష్య‌త్‌ను ముందే చెప్పడం నుండి చివరకు మీ రోజును ఉహించడం వరకు అన్ని తెలుసుకోవ‌చ్చు.  ముఖ్యంగా ఇవాళ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Ads

Today rashi phalau in telugu : మేషం

వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా స్థిర‌త్వం ల‌భిస్తుంది. ఉద్యోగ జీవితం ప‌ర్వాలేదు. ఆర్థిక ప‌రిస్థితి మెరుగుప‌డుతుంది. కుటుంబ స‌మ‌స్య సామార‌స్యంగా ప‌రిష్కార‌మ‌వుతుంది. మిత్రులు చేదోడు వాదోడుగా ఉంటారు. పిల్ల‌ల నుంచి శుభ‌వార్త‌లు వింటారు. పెళ్లి సంబంధం కుదురుతుంది.

Today rashi phalau in telugu : వృషభం 

ఉద్యోగ జీవితం ప్ర‌శాంతంగా సాగిపోతుంది. ఆర్థికంగా అభివృద్ధికి అవ‌కాశ‌ముంది. త‌ల‌పెట్టిన ప‌నులు శ్ర‌మ మీద పూర్తి అవుతాయి. ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంటుంది. పిల్ల‌లు పురోగ‌తి సాధిస్తారు. కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణ‌యాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక చింత‌న పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు వారికి అనుకూల స‌మ‌యం.

Today rashi phalau in telugu : మిథునం

ఉద్యోగ జీవితం సానుకూలంగా ఉంటుంది. నిరుద్యోగుల‌కు ఉద్యోగం ల‌భిస్తుంది. ఆదాయంలో కొద్దిగా పెరుగుద‌ల ఉండ‌వ‌చ్చు. వ్యాపారం చాలా వ‌ర‌కు నిల‌క‌డ‌గా సాగుతుంది. కొత్త ప‌రిచ‌యాల విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాలి. స్పెక్యులేష‌న్ లాభిస్తుంది. మిత్రుల వ‌ల్ల మేలు జ‌రుగుతుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం

Cancer Sign Character Nature Karkataka Rasi

ఆర్థిక స్థోమ‌త బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో అధికార లాభానికి అవ‌కాశం ఉంది. స‌మాజానికి మేలు జ‌రిగే ప‌నులు చేప‌డ‌తారు. ఒక వ్య‌క్తి గ‌త స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డ‌తారు. స్పెక్యులేష‌న్ లాభిస్తుంది. రుణ స‌మ‌స్య‌ల నుంచి కొద్దిగా బ‌య‌ట‌ప‌డ‌తారు. సొంత నిర్ణ‌యాలు ఉత్త‌మం.

Today rashi phalau in telugu : సింహం

ఉద్యోగం మార‌డానికి అవ‌కాశం ఉంది. ఆదాయం నిల‌క‌డ‌గా ఉంటుంది. నిరుద్యోగుల‌కు ఉన్న ఊళ్లో ఉద్యోగం ల‌భించే అవ‌కాశ‌ముంది. వ్యాపారుల ఆర్థిక ప‌రిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక స్థోమ‌త‌కు మించి ఇత‌రుల‌కు స‌హాయం చేస్తారు. కుటుంబ వాతావ‌ర‌ణం అనుకూలంగా ఉంటుంది. పెళ్లి సంబంధం వాయిదా ప‌డుతుంది.

Today rashi phalau in telugu : క‌న్య

ఉద్యోగ జీవితం భారంగా ఉంటుంది. ఇంటా బ‌య‌టా ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక విష‌యాలు ప‌ర‌వాలేదు. కుటుంబ వాతావ‌ర‌ణం ప్ర‌శాతంగా ఉంటుంది. ఆరోగ్య విష‌యంలో కాస్త అప్ర‌మ‌త్తంగా ఉండాలి. వృత్తి, వ్యాపారాల్లో ఉన్న వారు లాభాలు ఆర్జిస్తారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభ‌వార్తలు వింటారు.

Also Read : పుష్ప రికార్డు….50 రోజుల్లో 365 కోట్లు…!

Today rashi phalau in telugu : తుల

ఉద్యోగంలో అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తారు. వ్యాపారంలో లాభాలు పెరిగే అవ‌కాశ‌ముంది. ప‌లుకుబ‌డిగ‌ల వారితో ప‌రిచ‌యాలు ఏర్ప‌డుతాయి. బంధువుల‌కు స‌హాయం చేస్తారు. కొన్ని ఆర్థిక స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట‌ప‌డ‌తారు. ఆరోగ్యం జాగ్ర‌త్త‌గా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : వృశ్చికం

ఉద్యోగంలో పురోగ‌తికి అవ‌కాశం ఉంది. ఆర్థిక స‌మ‌స్య‌ల నుంచి కొంత వ‌ర‌కు గ‌ట్టెక్కుతారు. ప‌ట్టుద‌ల‌తో కొన్ని ముఖ్య‌మైన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారులు కొద్దిగా క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంది. వృత్తి నిపుణుల‌కు స‌మ‌యం అనుకూలంగా ఉంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్ల‌లు శుభ‌వార్త చెబుతారు.

Today rashi phalau in telugu : ధనస్సు

ఉద్యోగంలో సానుకూల మార్పు చోటు చేసుకుంటుంది. ఆక‌స్మిక ధ‌న లాభం ఉంది. వ్యాపారంలో లాభాలు కుదుటప‌డుతుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. పెద్ద‌ల ఆరోగ్యం కొద్దిగా ఆందోళ‌న క‌లిగిస్తుంది.

Today rashi phalau in telugu మకరం

ఉద్యోగంలో అద‌న‌పు బాధ్య‌త‌లు త‌ల‌కెత్తుకోవాల్సి వ‌స్తుంది. ఆదాయానికి , ఆరోగ్యానికి ఢోకా లేదు. రాద‌నుకున్న డ‌బ్బు చేతికి వ‌స్తుంది. అనుకున్న ప‌నులు పూర్త‌వుతాయి. వైద్య‌ప‌ర‌మైన ఖ‌ర్చులు చికాకు క‌లిగిస్తాయి. వ్యాపారంలో బాగా ఒత్తిడి ఉంటుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.

Today rashi phalau in telugu : కుంభం

ఉద్యోగంలో బాగా శ్ర‌మ ఉన్నా ల‌క్ష్యాల‌ను పూర్తి చేస్తారు. నిరుద్యోగుల‌కు చిన్న‌పాటి ఉద్యోగం ల‌భిస్తుంది. చాలా కాలంగా వేధిస్తున్న ఆర్థిక స‌మ‌స్య ఒక‌టి అనుకోకుండా ప‌రిష్కార‌మ‌వుతుంది. వ్యాపారంలో ఆదాయానికి లోటు ఉండ‌దు. ప‌ట్టుద‌ల‌తో కొన్ని ప‌నులు పూర్తి చేస్తారు. స్పెక్యులేష‌న్ ప‌ర‌వాలేదు. ఎవ‌రికీ హామీలు ఉండ‌వ‌ద్దు.

Today rashi phalau in telugu : మీనం

ఉద్యోగ జీవితం సాఫీగానే సాగిపోతుంది. నిరుద్యోగులు శుభ‌వార్త వింటారు. వ్య‌క్తిగ‌త స‌మ‌స్య ఒక‌టి మిత్రుల సాయంతో ప‌రిష్కారం అవుతుంది. త‌ల‌పెట్టిన ప‌నులు విజ‌య‌వంతంగా పూర్తి చేస్తారు. ఒక స్నేహితుడికి ఆర్థికంగా స‌హాయ‌ప‌డ‌తారు. ద‌గ్గ‌రి బంధువ‌ర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది.

Also Read :  యాల‌కుల గురించి అస‌లు విష‌యం తెలిస్తే ఇక వ‌ద‌లం..!


You may also like