Home » పుష్ప రికార్డు….50 రోజుల్లో 365 కోట్లు…!

పుష్ప రికార్డు….50 రోజుల్లో 365 కోట్లు…!

by AJAY
Ad

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రష్మిక మందన హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా పుష్ప. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అల్లు అర్జున్ స్మగ్లర్ గా కనిపించారు. డిసెంబర్ 17వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఐదు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. తెలుగు, తమిళ మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేశారు.

Advertisement

Advertisement

ఇక ఈ చిత్రంకు మొదట్లో నెగిటివ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. కానీ మెల్లిమెల్లిగా సినిమాకు పాజిటివ్ టాక్ పెరిగింది. ఇక ఇప్పటి వరకు ఈ సినిమా విడుదలై 50 రోజులు పూర్తయింది. 50 రోజుల్లో మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 365 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ ను విడుదల చేసింది. 50 రోజుల్లో అన్ని కోట్ల కలెక్షన్లు రాబట్టడంతో అల్లు అర్జున్ అభిమానులు కుషీ అవుతున్నారు. ఇక ప్రస్తుతం ఓటిటిలోనూ ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.

Visitors Are Also Reading