Home » యాల‌కుల గురించి అస‌లు విష‌యం తెలిస్తే ఇక వ‌ద‌లం..!

యాల‌కుల గురించి అస‌లు విష‌యం తెలిస్తే ఇక వ‌ద‌లం..!

by Anji
Ad

అత్య‌ద్భుత ఔష‌ద గుణాలు క‌లిగిన వాటిలో యాల‌కులు ఒక‌ట‌ని చెప్ప‌వ‌చ్చు. వంట కోసం వినియోగించే వీటిని మ‌నం పెద్ద‌గా ప‌ట్టించుకోం. ఏదో మంచి వాస‌న కోసం వాడుతుంటారు. కానీ అస‌లు యాల‌కుల‌ను విలువ చాలా మందికి తెలియ‌దు. ఆయుర్వేద వైద్యంలో యాలకుల‌ను అనాదిగా వాడుతూ వ‌స్తున్నారు. కానీ నేటి త‌రానికి యాల‌కుల గురించి అంత‌గా తెలియ‌దు. శ‌రీరానికి అల్లం ఎంత మేలు చేస్తుందో యాల‌కులు కూడా ఆరోగ్యానికి అంతే మేలు చేస్తాయట‌.

Advertisement

దీర్ఘ‌కాలిక వ్యాధులైన మ‌ధుమేహం, ఆస్త‌మా, హృద్రోగ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారికి యాల‌కులు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతాయ‌ట‌. మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారిని ఆస్థితి నుంచి బ‌య‌ట‌ప‌డేసేందుకు కూడా ఈ సుగంధ‌ద్ర‌వ్యం ప‌నికి వ‌స్తుంద‌ట‌. వాతావ‌ర‌ణంలో మార్పుల కార‌ణంగా వ‌చ్చ సీజ‌న‌ల్ అనారోగ్య స‌మ‌స్య‌లు అయిన ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం వంటి వాటిని న‌యం చేసేందుకు హోం రెమిడీలో భాగంగా యాల‌కుల‌ను వాడితే ఎంతో ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ట‌.

Also Read :  ఖిలాడి నుండి అనసూయ వచ్చేసింది….బ్లాక్ సారీలో అదిరిపోయే లుక్..!

Advertisement

ముఖ్యంగా వాంతులు, వికారంగా ఉండ‌టం వంటి స‌మ‌స్య‌ల నుంచి యాల‌కుల‌తో ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంద‌ట‌. శ‌రీరం లోప‌ల ఆరోగ్యానికి హానీ చేసే బ్యాక్టీరియాతో పోరాడి అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌ప్పించ‌డంలో యాల‌కుల స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేస్తాయ‌ట‌. ఒబెసిటీ, అధిక ర‌క్త‌పోటు, కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు యాల‌కుల‌ను తీసుకోవ‌డం మంచిద‌ట‌. నోటి దుర్వాస‌న‌, దంత స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట‌ప‌డేయ‌డ‌మే కాకుండా. చిగుళ్ల‌ను బ‌లంగా ఉంచంలో యాల‌కులు ప్ర‌ధాన పాత్ర పోషిస్తాయ‌ట‌. కేవ‌లం ఇవి మాత్ర‌మే కాదు.. వ్య‌క్తిగ‌త‌ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారికి యాల‌కులు దివ్య ఔష‌దం అని ఆయుర్వేదం చెబుతుంది.

కొంద‌రు పురుషుల్లో స‌హ‌జంగా ఉండే స‌మ‌స్య ఎక్కువ సేపు చేయ‌లేక‌పోవ‌డం, భార్య‌ను సంతృప్తి ప‌ర‌చ‌లేక స‌మ‌స్య‌ను ఎవ్వ‌రితో చెప్పుకోలేక త‌మ‌లో తాము మ‌ద‌న ప‌డిపోతుంటారు. అలాంటి వారికి యాల‌కులు వ‌ర ప్ర‌ధాయిని అని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు. అలాంటి పురుషులు రోజు రాత్రిపూట ప‌డుకునే ముందు రెండు యాల‌కుల‌ను తింటే ఆ త‌రువాత వారి దాంప‌త్య జీవ‌నం సంతోషంగా ఉంటుంది. అదేవిధంగా యాల‌కుల నూనెను వాడితో వారికి ఎంతో ప్ర‌యోజ‌నం చేకూరుతుంది. ఇన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్న యాల‌కుల‌ను నేరుగా తీసుకోవ‌డం కొంచెం క‌ష్టం అయితే.. ఇలాచి టీ రూపంలో తీసుకుంటే ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చ‌ని ఆయుర్వేధ నిపుణులు పేర్కొంటున్నారు.

Also Read :  ‘శేఖర్‌’ సినిమా సాంగ్‌ లాంఛ్‌లో రాజశేఖర్‌ భావోద్వేగం..

Visitors Are Also Reading