Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 01.12.2022: మేషం

మీరు ఇష్టంగా చేసే పనులు ఫలిస్తాయి. తోటివారితో విబేధాలు రాకుండా చూసుకోవాలి. అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకుంటారు. కొన్ని పరిస్థితులు మనోవిచారం కలిగిస్తాయి.

Today rashi phalau in telugu: వృషభం 

మానసికంగా దృఢంగా ఉండి.. ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కోగలుగుతారు. ఓ శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. 

Today rashi phalau in telugu: మిథునం

కష్టాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి.

Today rashi phalau in telugu : కర్కాటకం

పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. అనుకూలమైన సమయం. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి.

Today rashi phalau in telugu : సింహం

బుద్ధిబలంతో పని చేసి అనుకున్నది సాధిస్తారు. ఓ శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. బుద్ధిబలం బాగుంటుంది. ఆర్థికంగా శుభపలితాలు ఉంటాయి. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. శ్రమతో ఒత్తిడి పెరుగుతుంది. మానసిక ప్రశాంతతను కోల్పోకూడదు. 

Today rashi phalau in telugu : తుల

ప్రారంభించబోయే పనుల్లో ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి. అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందకపోవచ్చు. బంధువులతో మాట్లాడే సమయంలో ఆచితూచి వ్యవహరించాలి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

కష్టపడకుంటే పనులు సకాలంలో పూర్తి అవ్వవు. కీలక విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ సభ్యుల మాటకు గౌరవం ఇస్తూ ముందుకు వెళ్లండి.

Today rashi phalau in telugu : ధనుస్సు

ప్రారంభించిన పనులు పూర్తి అవుతాయి. తోటివారితో సంతోషంగా గడుపుతారు. బంధు, మిత్రులతో కొత్త బంధాలు ఏర్పడుతాయి. కీలకమైన చర్చలు చేస్తారు.

Today rashi phalau in telugu : మ‌క‌రం

కొన్ని సందర్భాల్లో లౌక్యంగా వ్యవహరించి సమస్యలను అధిగమిస్తారు. భవిష్యత్ ని  దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగండి. తోటివారిని కలుపుకొని పోవడం ద్వారా పనులు త్వరగా పూర్తవుతాయి. 

Today rashi phalau in telugu : కుంభం

శుభ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక విషయాల్లో లాభాలు చేకూరుతాయి. అన్నింటిని మీ ఆరోగ్యం సహకరిస్తుంది. కొన్ని విషయాల్లో ఇతరులతో చాాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.

Today rashi phalau in telugu :  మీనం

స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. బంధువులతో కాస్త ప్రేమగా వ్యవహరించాలి. కొంత మంది మీకు కీడును కలిగించే వారు తారసపడుతారు. వారి పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి పరిస్థితులోనైనా జాగ్రత్తగా వ్యవహరించడం ఉత్తమం.

Visitors Are Also Reading