Home » ప్రభాస్-మారుతి మూవీ టైటిల్ ఇదేనా..?

ప్రభాస్-మారుతి మూవీ టైటిల్ ఇదేనా..?

by Anji
Ad

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, టాలీవుడ్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ప్రభాస్ ఆదిపురుష్ నెగిటివ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. ప్రభాస్ నటించే సినిమాల ఫలితం ఎలా ఉన్నప్పటికీ వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు. ఈ మధ్యకాలంలో సలార్, ప్రాజెక్ట్ కే మూవీస్ నుంచి అప్డేట్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక మారుతి సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో షూటింగ్ జరగడం లేదని భావిస్తున్నారు అభిమానులు. అసలు కథ ఏంటంటే.. ఈ మూవీ షూటింగ్ గురించి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే సైలెంట్ గా పూర్తి చేస్తున్నట్టు తెలుస్తోంది. 

Advertisement

 

ఇప్పటికే ప్రభాస్ టాకీ పార్ట్ కూడా చాలా వరకు పూర్తి అయినట్టు సమాచారం. ప్రభాస్ కి జంటగా నిధి అగర్వాల్, మాళవిక మోహన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీకి సంగీత దర్శకుడిగా థమన్ పేరు పరిశీలనలో ఉందట. ఈ సినిమా టైటిల్ రాజా డీలక్స్ అంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతున్నప్పటికీ.. అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ మాత్రం రాలేదు. ఈ సినిమా టైటిల్ విషయంలో తాజాగా మరో టైటిల్ కూడా ప్రచారం జరుగుతోంది. తొలుత ప్రచారం జరిగిన రాజాడీలక్స్ కాదని.. ఈ చిత్రానికి రాయల్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. 

Advertisement

ఈ టైటిల్ ని నిర్మాతలు రిజిస్టర్ కూడా చేయించినట్టు సమాచారం. ఈ చిత్రంలో ఎంటర్టైన్ మెంట్ తో పాటు హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కూడా హైలెట్ గా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది. 2024 సమ్మర్ లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం యొక్క టైటిల్ గురించి క్లారిటీ రావాలని ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ నుంచి వరుస యాక్షన్ సినిమాలు వస్తున్న తరుణంలో డిఫరెంట్ జోనర్ లో వస్తున్న ఈ మూవీ ఏమేరకు అలరిస్తుందో వేచి చూడాలి మరి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

విజయ్ దేవరకొండ-రష్మిక ఎంగేజ్మెంట్.. వివాహం ఎప్పుడంటే..?

అండర్సన్ కంటే కూడా జహీర్ ఖానే బెస్ట్ బౌలర్.. ఇషాంత్ శర్మ ఇంకా ఏమన్నాడంటే..?

Uday kiran: ఉదయ్ కిరణ్ బాలకృష్ణతో కలిసి పనిచేశారని తెలుసా? వైరల్ అవుతున్న ఫోటో!

Visitors Are Also Reading