Home » విజయ్ దేవరకొండ-రష్మిక ఎంగేజ్మెంట్.. వివాహం ఎప్పుడంటే..?

విజయ్ దేవరకొండ-రష్మిక ఎంగేజ్మెంట్.. వివాహం ఎప్పుడంటే..?

by Anji
Published: Last Updated on
Ad

టాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో యంగ్ హీరోలు అందరూ పెళ్లిళ్ల బాట పడుతున్నారు. ఇప్పటికే యంగ్ హీరో శర్వానంద్ పెళ్లి చేసుకొని ఓ ఇంటి వాడయ్యాడు. శర్వానంద్ తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ కూడా త్వరలోనే లావణ్య త్రిపాఠి తో ఏడడుగులు వేయబోతున్నాడు. ఇటీవలే లావణ్య త్రిపాఠి-వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఇదే కోవలోకి మరో యంగ్ హీరో కూడా రాబోతున్నాడు. ఆ యంగ్ హీరో ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వచ్చిన కొద్దికాలంలోనే రౌడీ హీరోగా మంచి గుర్తింపు సాధించారు విజయ్ దేవరకొండ. ఇతనికి లేఢీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. అయితే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నతో చాలా కాలంగా లవ్ లో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. పలు సందర్భాల్లో వీరిద్దరూ కలిసి వెకేషన్ కి వెళ్లడం ఆ ఫోటోలను షేర్ చేయడం సోషల్ మీడియాలో మనం చూసాం. ఎన్నో ఏళ్ల నుంచి వీరి ప్రేమాయణం కొనసాగుతోంది అంట. నేపథ్యంలోనే వీరి గురించి ఓ గుడ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది ఏంటంటే.. రష్మిక మెడలో మూడు ముళ్ళు వేసేందుకు విజయ్ దేవరకొండ సిద్ధమవుతున్నారట. వీరిద్దరి పెళ్లికి ఇరు కుటుంబాలు కూడా ఓకే చెప్పినట్టు సమాచారం.

Advertisement

అంతే కాదండి పెళ్లిపై కూడా కాస్త ఒత్తిడి తీసుకొస్తున్నారని తెలుస్తోంది. ఇటీవల వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి వీరిని కూడా పెళ్లి చేసుకోవాలని ఇరు కుటుంబ సభ్యులు చాలా తొందర పెడుతున్నారట. ఈ తరుణంలోనే వీరి ఎంగేజ్మెంట్ కూడా త్వరలోనే జరగబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఆ తర్వాత వచ్చే ఏడాదిలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగనున్నట్టు సమాచారం. ఇదే నిజమైతే టాలీవుడ్ లో మరో ప్రేమ జంట ఒకటి కాబోతున్నారని చెప్పవచ్చు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

చిరు అభిమాని ఎలా నాగబాబు భార్య అయ్యారు..? ఇంత పెద్ద కథ ఉంది మీకు తెలుసా..?

 ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా కోసం రూ.80కోట్ల కెమెరా.. భారీగానే కొరటాల ప్లాన్..!

బాలకృష్ణ సినిమాకే నో చెప్పిన పాత హీరోయిన్ ఎవరో తెలుసా..?

Visitors Are Also Reading