Home » Uday kiran: ఉదయ్ కిరణ్ బాలకృష్ణతో కలిసి పనిచేశారని తెలుసా? వైరల్ అవుతున్న ఫోటో!

Uday kiran: ఉదయ్ కిరణ్ బాలకృష్ణతో కలిసి పనిచేశారని తెలుసా? వైరల్ అవుతున్న ఫోటో!

by Srilakshmi Bharathi
Ad

ఉదయ్ కిరణ్ భౌతికంగా మన మధ్య లేకయినా.. ఆయనని ఈ తెలుగు పరిశ్రమ, తెలుగు ప్రేక్షకులు అంత ఈజీగా మరిచిపోలేరు. 2000లో చిత్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఉదయ్ కిరణ్ లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. మనసంతా నువ్వే సినిమాతో ఆయన మరో హిట్ కొట్టారు. ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస హ్యాట్రిక్కులతో దూసుకెళ్లారు. అప్పట్లోనే ఆయనకు లేడీ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉండేది.

Advertisement

అతనితో సినిమాలు తీయడానికి దర్శక నిర్మాతలు ఓ రేంజ్ లో ఆసక్తి చూపించేవారు. అయితే ఉన్నట్లుండి ఆయన సినిమాలు ప్లాప్ అవడం మొదలైంది. వరుస ఫ్లాప్స్ రావడంతో సినిమా అవకాశాలు తగ్గాయి. మరో వైపు వ్యక్తిగత జీవితంలోని మార్పులు కూడా ఆయనపై ప్రభావం చూపించాయి. తీవ్ర సంఘర్షణకు లోనైన ఉదయ్ కిరణ్ 2014 జనవరి 6న తన ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్య ఆయన ఫాన్స్ తో బాటు ఇండస్ట్రీలో ఎందరినో కుదిపేసింది.

udaykiran

Advertisement

కాగా, నేడు ఉదయ్ కిరణ్ పుట్టినరోజు కారణంగా ఆయన ఫాన్స్ ఉదయ్ కిరణ్ పాత ఫోటోలను తెగ షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో నందమూరితో కలిసి దిగిన ఓ ఫోటోను ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. ఎలాంటి బాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ కి వచ్చిన ఉదయ్ కిరణ్ తక్కువ టైం లోనే స్టార్ డమ్ సంపాదించుకున్నారు. అలాంటి టైములో బాలకృష్ణ “నర్తనశాల” సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమాలో సౌందర్య కూడా నటించారు. కానీ, సౌందర్య మధ్యలో ఆకస్మిక మరణం పొందడంతో ఈ చిత్ర షూటింగ్ ఆగిపోయింది. ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ అభిమన్యుడి పాత్రని పోషించారు. ఈ సినిమా షూటింగ్ లో తీసుకున్న ఫోటోలను ఫ్యాన్స్ ఇప్పుడు వైరల్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు:

విజయ్ దేవరకొండ-రష్మిక ఎంగేజ్మెంట్.. వివాహం ఎప్పుడంటే..?

ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా కోసం రూ.80కోట్ల కెమెరా.. భారీగానే కొరటాల ప్లాన్..!

ఇండస్ట్రీలో కింగ్ లా బ్రతికి అనాధల చనిపోయిన స్టార్స్ వీరే..!

Visitors Are Also Reading