Home » బ్రాహ్మిణీని మహేష్ బాబుకి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్న బాలయ్య .. కానీ చివరికి ఇలా జరిగిందట ..!

బ్రాహ్మిణీని మహేష్ బాబుకి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్న బాలయ్య .. కానీ చివరికి ఇలా జరిగిందట ..!

by Anji
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న వయసులోనే సినిమా రంగంలోకి అడుగు పెట్టి తనదైన శైలిలో నటిస్తూ ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోలలో ఒకరిగా మారారు. మంచి సక్సెస్ అందుకున్న మహేష్ బాబు.. ప్రస్తుతం గుంటూరు కారం మూవీ  షూటింగ్ తో  బిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

Advertisement

 మహేష్ బాబు వ్యక్తిగత విషయానికొస్తే.. బాలీవుడ్ నటి నమ్రత శిరోద్గర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత నమ్రత సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. ప్రస్తుతం కుటుంబ బాధ్యతలను వ్యవహరిస్తూ ఫ్యామిలీ లైఫ్ ని చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. బాలీవుడ్ నటి అయినప్పటికీ అచ్చమైన తెలుగు ఇంటి కోడలుగా కుటుంబ బాధ్యతలను వ్యవహరిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటివరకు నమ్రతతో మహేష్ బాబు వైవాహిక జీవితంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా సాఫీగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఎంతో మందికి ఆదర్శంగా కూడా నిలుస్తున్నారు.

Advertisement

అయితే తాజాగా సోషల్ మీడియాలో మహేష్ బాబు గురించి ఆసక్తికర వార్త ఒకటి తెగ  వైరల్ గా మారింది. నటసింహం బాలయ్య మొదటగా తన కుమార్తె బ్రాహ్మిణీని మహేష్ బాబుకి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారట. అప్పట్లో ఈ వార్త సంచలనంగా మారింది. ఇదే వార్త మరోసారి వెలుగులోకి వచ్చింది. మహేష్ బాబు చూడడానికి చాలా అందంగా ఉంటారు. అలాగే స్టార్ హీరో. గొప్ప సినీ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ కావడంతో మహేష్ బాబును అల్లుడు చేసుకోవాలని భావించారట. అయితే అప్పటికే మహేష్ బాబు నమ్రతతో ప్రేమలో ఉన్నారు. దీంతో మహేష్ బాబు బాలయ్య ప్రపోజల్ ను రిజెక్ట్ చేశారట. అయితే ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

 

Visitors Are Also Reading