Telugu News » Blog » ఈ ఏడాది శ్రీరామనవమి వెరీ స్పెషల్.. 700 ఏళ్ల తరువాత..!

ఈ ఏడాది శ్రీరామనవమి వెరీ స్పెషల్.. 700 ఏళ్ల తరువాత..!

by Anji
Ads

ప్రతీ ఏడాది చైత్ర శుద్ధ నవమి రోజు శ్రీరాముడి జన్మదినం సందర్భంగా రామనవమి పండుగను తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ్యాప్తంగా జరుపుకుంటారు. హిందూ మత విశ్వాసా ప్రకారం.. ఈ ఏడాది రామనవమి తేదీ వెరీ స్పెషల్. త్రేతాయుగంలో ఏర్పడిన నక్షత్ర రాశులు.. యోగాను పునరా వృతం చేస్తోంది. ఈ యోగం సుమారు 700 సంవత్సరాల కిందటే రామనవమి నాడు ఏర్పడిందని నమ్మకం. శ్రీరాముడి పూజకు ఈ రోజు చాలా ప్రాముఖ్యత ఉందని.. అనేక ఇతర శుభయోగాలు జత కలిశాయని చెబుతున్నారు. అలాంటి పరిస్థితిలో పవిత్రమైన నవమి అన్ని రకాల శుభకార్యాలకు చాలా పవిత్రమైందిగా పరిగణించబడుతుంది.  

Advertisement

Also Read :  శ్రీరామనవమి రోజు పెట్టే ప్రసాదంలో అంతటి అద్భుత ఔషదం ఉందా ?

రాముడు చైత్ర మాసం శుక్ల పక్షం తొమ్మిదవ రోజు పునర్వసు నక్షత్రం శుభ సమయంలో గురువారం జన్మించాడు. పంచాంగం ప్రకారం.. ఈ ఏడాది రామనవమి రోజు ఏర్పడిన గ్రహాలు.. రాశులను పరిశీలించినట్టయితే 700 సంవత్సరాల తరువాత 09 శుభయోగాలు కలుగుతున్నాయి. పంచాంగం ప్రకారం.. మహాలక్ష్మీ, బుధాదిత్య, హన్స్, సిద్ధి, కేదార్, సర్వార్థసిద్ధి, గజకేసరి, సత్కీర్తి, రవియాగం ఇవాళ ఏర్పడుతున్నాయి. ఇవాళ యోగాలన్ని శ్రీరాముడి ఆరాధన చేసిన వారికి పుణ్యఫలాలు ఇవ్వబోతున్నాయి. చేపట్టినటువంటి పనులు, ఆటంకాలు లేకండా జరగడానికి యోగాలు పని చేస్తాయి. శ్రీరామనవమి పంచాంగం ప్రకారం.. చైత్రమాసం శుక్లపక్ష నవమి తిథి మార్చి 29, 2023 బుధవారం రాత్రి 9.07 గంటలకు ప్రారంభమై మార్చి 30, 2023 గురువారం రాత్రి 11.30 గంటల వరకు ఉంటుంది. ఈరోజు శ్రీరాముడిని పూజించడానికి ఉత్తమమైన ముహుర్తం ఉదయం 11.11 నుంచి మధ్యాహ్నం 1.40 వరకు ఉంటుంది. 

Advertisement

Also Read :  నాని ద‌స‌రా సినిమా ప్ల‌స్ లు మైన‌స్ లు ఇవే…సినిమాకు ఆ ఒక్క‌టే మైన‌స్ అయ్యిందట‌..?

Manam News

ఈరోజు ఎన్నో శుభ ముహూర్తాలున్నాయి. శుక్రవారం 06.13 వరకు గురు పుష్యయోగం ఉంటుంది. సర్వార్థ సిద్ధి యోగం రోజు అంతా ఉంటుంది. శ్రీరామనవమి రోజు రాత్రి నుంచి మరుసటి రోజు వరకు అమృత సిద్ధి యోగం ఉంటుంది. శ్రీరామనవమి రోజు భక్తి శ్రద్ధలతో శ్రీరాముడిని పూజిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. పూజ చేసేటప్పుడు దేవుడికి కలువ పువ్వులు లేదా తామర పువ్వులను, మొగలి పువ్వులను సమర్పించండి. పవిత్ర నదిలో స్నానమాచరించి సూర్యుడికి అర్ఝ్యం సమర్పించండి. ఇలా చేయడం వల్ల సాధకుడి పాపాలు నశించి, శరీరం, మనస్సు పవిత్రంగా మారుతుందని నమ్ముతారు. శ్రీరామనవమి రోజు పూజ-పారాయణ మాత్రమే కాదు.. దానం-దక్షిణకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మీ శక్తి మేరకు నిరుపేదలకు అవసరం ఉన్నవారికి ఆహార, వస్త్రం ఇలా అవసరమున్న వస్తువులను దానంగా ఇవ్వండి. 

Advertisement

Also Read :   Adi Purush : శ్రీరామనవమి స్పెషల్… ‘ఆది పురుష్’ నుంచి కొత్త పోస్టర్… రిలీజ్ డేట్ పై మళ్లీ!

You may also like