Home » నాని ద‌స‌రా సినిమా ప్ల‌స్ లు మైన‌స్ లు ఇవే…సినిమాకు ఆ ఒక్క‌టే మైన‌స్ అయ్యిందట‌..?

నాని ద‌స‌రా సినిమా ప్ల‌స్ లు మైన‌స్ లు ఇవే…సినిమాకు ఆ ఒక్క‌టే మైన‌స్ అయ్యిందట‌..?

by AJAY
Ad

నాచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టించిన ద‌స‌రా సినిమా నేడు విడుద‌లై ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా కీర్తి సురేష్ నానికి జోడీగా సినిమాలో న‌టించింది. ఇక నాని కెరీర్ లో ఈ సినిమాతో మొద‌టిసారి పాన్ ఇండియాకు ప‌రిచ‌యం అయ్యాడు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెర‌కెక్కింది. ఇక సినిమా టీజ‌ర్ మ‌రియు ట్రైల‌ర్ విడుద‌లైన నాటి నుండి భారీ అంచ‌నాలు నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే.

ALSO READ : బాలకృష్ణ క్యారెక్టర్ గురుంచి నిజాలు చెప్పిన ఆయన చిన్నల్లుడు..నా భార్యకు నచ్చవంటూ..?

Advertisement

కాగా థియేట‌ర్ ల‌లో నేడు విడుద‌లైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వ‌స్తోంది. అయితే ఏ సినిమా అయినా చిన్న చిన్న మైన‌స్ ఉంటాయి కాబ‌ట్టి. ఈ సినిమాలో త‌మ‌కు ఏం న‌చ్చింది…ఏం నచ్చ‌లేదు అని నెటిజ‌న్ లు ట్విట్ట‌ర్ లో ట్వీట్ లు చేస్తున్నారు. ఆ లెక్క‌న సినిమాలోన ప్ల‌స్ పాయింట్ లు మైన‌స్ పాయింట్ లు ఏవో ఇప్పుడు చూద్దాం….సినిమాలో నాని న‌ట‌న చింపేశాడ‌ని చెప్పుకుంటున్నారు.

Advertisement

అంతే కాకుండా కీర్తి సురేష్ కూడా మ‌రోసారి అద‌ర‌గొట్టింద‌ని టాక్. ఇక సినిమా ఫ‌స్టాఫ్ బాగుంద‌ని ఇంట‌ర్వెల్ బ్యాంగ్ అని చెబుతున్నారు. ఇక ద‌ర్శ‌కుడికి ఇది మొద‌టి సినిమా అయిన‌ప్ప‌టికీ టెక్నిక‌ల్ వ్యాల్యూల్స్ ఫైట్స్ సీన్ లు ఇలా ఎక్క‌డా కూడా త‌గ్గ‌లేద‌ని చెబుతున్నారు. సినిమాలో ల‌వ్ అండ్ ఎమోష‌న‌ల్ సీన్ లు కూడా ఆక‌ట్టుకునే విధంగా ఉన్నాయ‌ట‌.

అంతే కాకుండా సినిమా క్లైమాక్స్ పై ఎక్కువ ప్ర‌శంస‌లు అందుతున్నాయి. కేవ‌లం క్లైమాక్స్ కోస‌మే టికెట్ కొనుక్కుని సినిమా చూడ‌వ‌చ్చ‌ని చెబుతున్నారు. ఇక మైన‌స్ ల విష‌యానికి వ‌స్తే క‌థ అంత గొప్ప కాద‌ని టాక్. అంతేకాకుండా భారీ యాక్ష‌న్ స‌న్నివేశాల‌కు బీజీఎం గొప్ప‌గా ఇవ్వ‌లేద‌ని కూడా నెటిజ‌న్ లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే రెస్పాన్స్ చూస్తుంటే చిన్న‌చిన్న మైన‌స్ మాత్ర‌మే ఉన్నాయి త‌ప్ప ప్రేక్ష‌కులు ఎక్క‌డా నిరాశ‌చెంద‌డంలేద‌ని అర్థం అవుతోంది.

ALSO READ :సుజాత బతుకు బుగ్గిపాలేనా.. నెలకే జబర్దస్త్ రాకేష్ కు బోర్ కొట్టిందా..?

Visitors Are Also Reading