Telugu News » Blog » Adi Purush : శ్రీరామనవమి స్పెషల్… ‘ఆది పురుష్’ నుంచి కొత్త పోస్టర్… రిలీజ్ డేట్ పై మళ్లీ!

Adi Purush : శ్రీరామనవమి స్పెషల్… ‘ఆది పురుష్’ నుంచి కొత్త పోస్టర్… రిలీజ్ డేట్ పై మళ్లీ!

by Bunty
Ads

 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఓంరౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రామాయణం ఆధారంగా రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముని పాత్రలో,కృతి సనన్ సీత పాత్రలో నటించనున్నారు. రామాయణంలో కీలక పాత్ర అయినటువంటి రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు.

Advertisement

READ ALSO : విడాకులపై సమంత సంచలన వ్యాఖ్యలు..”పుష్ప” ఐటెం సాంగ్ వద్దన్నారంటూ !

ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాపై టీజర్ విడుదల వరకు ఎలాంటి వార్తలు రాలేవు. కానీ ఎప్పుడైతే టీజర్ వచ్చిందో ఈ సినిమా గురించి ఓ రేంజ్ లో చర్చ జరిగింది. టీజర్ లో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా సన్నివేశాలు ఉన్నాయంటూ కొందరు ఆరోపించిన విషయం తెలిసిందే.

Prabhas' new Adipurush poster unveiled; internet says 'doesn't look promising' | Bollywood - Hindustan Times

Advertisement

తాజాగా, శ్రీరామనవమి పండుగ సందర్భంగా ‘ఆది పురుష్’ సినిమా నుంచి న్యూ పోస్టర్ విడుదల అయింది. ఆ పోస్టర్ ను స్వయంగా ప్రభాస్ తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా రిలీజ్ చేశాడు. “మంత్రం కన్నా గొప్పది నీ నామం జై శ్రీరామ్” అనే క్యాప్షన్ ను జత చేసాడు. దీంతో అది చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఈ చిత్రం జూన్ 16న విడుదల కానుంది.

Advertisement

read also : RRR చిత్ర యూనిట్ గురించి నిర్మాత డీవీవీ దానయ్య సంచలన వ్యాఖ్యలు.. అందుకోసమేనా ?

You may also like