Home » అల్లు అర్జున్ చీరకట్టుడు వెనుక దాగి ఉన్న కథ ఇదేనా ?

అల్లు అర్జున్ చీరకట్టుడు వెనుక దాగి ఉన్న కథ ఇదేనా ?

by Anji
Ad

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప 2. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే సుకుమార్ బన్నీని చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ అయితే సోషల్ మీడియాను షేక్ చేసిందనే చెప్పాలి. ఓ స్టార్ హీరో అయి ఉండి ఇలా చీరకట్టి, కాళికా మాత రూపంలో దర్శనమిస్తాడు అని ఎవ్వరూ ఊహించలేకపోయారు. 

Also Read :  ప్రశాంత్ నీల్ మూవీపై ఇంట్రెస్ట్ అప్డేట్..!

Advertisement

తొలుత నుంచి చెబుతున్నట్టుగానే పాత్ర కోసం బన్నీ ఏదైనా చేస్తాడు. కథలో భాగంగా ఇప్పుడు కూడా ఈ గెటప్ ని వేసినట్టు తెలుస్తోంది. ఈ కాళికామాత గెటప్ వెనుక పెద్ద కథనే దాగి ఉందట. నెటిజన్లు ప్రస్తుతం ఈ పోస్టర్ వెనుక ఉన్న కథను డీకోడ్ చేస్తున్నారు. పూర్వకాలంలో తిరుపతి పరిసర ప్రాంతాల్లో పాలెగాండ్ల రాజ్యం నడుస్తుండేది. వారు ఏది చెబితే అక్కడ అదే రాజ్యం. మహిళలపై వారు చేసే అత్యాచారాలకు లెక్కనే ఉండేది కాదట. చిన్న, పెద్ద తేడా లేకుండా నచ్చిన అమ్మాయిని బలవంతం చేసే చంపేసేవారట. దీంతో అక్కడ ఉన్న గ్రామస్తులు తమ కష్టాలను చెప్పుకొని ప్రార్థిస్తే గంగమ్మ తల్లి అవతరించిందట. ఆమెకు భయపడి పాలెగాండ్లు అంతా అడవిలోకి పారిపోయి దాక్కొనేవారట.

Advertisement

అలా దాక్కున్న వారిని బయటికి తీసుకురావడానికి మగవారే ఆడవారిగా మారి చీరకట్టుకొని అడవిలోకి వెళ్లి వారిని బయటికి తీసుకొచ్చే వారట. వారిని గంగమ్మ సంహరించేదని చెప్పుకొస్తారు. గంగమ్మ తల్లి అవతారించా ఆ గ్రామాలలో అత్యాచారం ఆగిపోయాయట. ఈ కథ ఆధారంగానే పుష్ప 2 ఉండబోతుందని సమాచారం అడవిలో ఉన్న విలన్స్ ని చంపడానికి పుష్ప కాళికా మాతలా మారి దుష్ట సహారం చేస్తాడట. ఈ గెటప్ లో క్లైమాక్స్ ఫైట్ ని సెట్ చేశాడట సుకుమార్. ఇదే కనుక నిజం అయితే పుష్ప 2 క్లైమాక్స్ నభూతో నభవిష్యత్ అవుతుందని చెబుతున్నారు. దర్శకుడు ఈ సినిమాను ఏ విధంగా ప్లాన్ చేశాడో తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.  

Also Read :   ‘బలగం’ సినిమాలో  కొమురయ్య చిన్న కొడుకు చక్రవాకం సీరియల్ నటించాడని తెలుసా ?

Visitors Are Also Reading