Home » ప్రశాంత్ నీల్ మూవీపై ఇంట్రెస్ట్ అప్డేట్..!

ప్రశాంత్ నీల్ మూవీపై ఇంట్రెస్ట్ అప్డేట్..!

by Anji
Ad

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్30 చేస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ నటిస్తోంది. హై ఓల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇటీవలే మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది. భయం అంటే ఏంటో తెలియని మనుషులను భయపెట్టే వ్యక్తి చుట్టూ ఈ స్టోరీ ఉండబోతుందని గతంలోనే దర్శకుడు చెప్పేశారు. ఈ చిత్రం తరువాత ఎన్టీఆర్ హిందీలో వార్ 2 చేయనున్నారు. ఈ చిత్రంలో  హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. 

Also Read :  అప్పట్లో ఎన్టీఆర్ కి సాధ్యమైన రికార్డు మళ్ళీ బాలకృష్ణ సాధించారా ? కేవలం నందమూరి వారికే సొంతం !

Advertisement

ఈ చిత్రం కోసం ఎన్టీఆర్  90 రోజుల వరకు కాల్షిట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో  హృతిక్, తారక్ కలిసి నటించబోయే ఈ చిత్రంపై భారీ హైప్ క్రియేట్ అయింది.మరోవైపు తారక్ అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న ఈ చిత్రం ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోయే ప్రాజెక్ట్. వాస్తవానికి కొరటాల శివతో ప్రాజెక్ట్ పూర్తి కాగానే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ స్టార్ట్ కావాల్సి ఉంది. అనూహ్యంగా వార్ 2 రావడంతో ఈ చిత్రం మరింత ఆలస్యం కానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో సలార్ సినిమా తెరకెక్కిస్తున్నారు. 

Advertisement

Also Read :  టబుతో కలిసి నిత్యామీనన్ నటించిన సినిమా ఏదో మీకు తెలుసా ?

Manam News

ఈ సినిమా పూర్తయిన తరువాత ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను చేయనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాలేదట. తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో రాబోయే ప్రాజెక్ట్ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఎన్టీఆర్ సినిమా షూటింగ్ ఎక్కువగా విదేశాల్లో తెరకెక్కించనున్నారని సెప్టెంబర్ 28న సలార్ విడుదల అనంతరం ప్రశాంత్ నీల్ నెలరోజుల పాటు విదేశాలకు వెళ్లి అక్కడ లొకేషన్స్ చూసుకుంటూ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేయనున్నారని ప్రచారం నడుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నదట. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంచనాలను మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. 

Also Read :   కైకాల సత్యనారాయణ కొడుకుని ఎప్పుడైనా చూసారా ..వీరి జీవితం ప్రతి ఒకరికి ఆదర్శం !

Visitors Are Also Reading