Home » షారూఖ్ ఖాన్ పఠాన్ మూవీ సాధించిన రికార్డు గురించి తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

షారూఖ్ ఖాన్ పఠాన్ మూవీ సాధించిన రికార్డు గురించి తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

by Anji
Ad

కరోనా తర్వాత సినీ ఇండస్ట్రీ ఎంత డల్ అయిందో దాదాపు అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో బాలీవుడ్ బాక్సాఫీస్ కి కోలుకోలేని దెబ్బ పడుతోంది. తాజాగా షారూఖ్ ఖాన్ పఠాన్ చిత్రం కాస్త ఊరటనిచ్చింది.  బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సౌత్ మూవీస్ క్రియేట్ చేసిన రికార్డులను మొత్తం పఠాన్ చిత్రం బ్రేక్ చేసేసింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే జంటగా నటించిన ఈ చిత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే బాక్స్ ఆఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేసింది. 

Also Read :  చిరంజీవి, బాలకృష్ణ గురించి అల్లు రామలింగయ్యతో NTR చెప్పినవి.. ఈరోజు అక్షరాల నిజం అయ్యాయా?

Advertisement

జనవరి 25న విడుదలైన పటాన్ సినిమా సక్సెస్ ఫుల్ గా రోజు పూర్తి చేసుకుంది. భారతదేశంలోనే పఠాన్ మూవీ దాదాపు 800 స్క్రీన్ లలో 50 డేస్ పూర్తి చేసుకుంది.అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా పఠాన్ మూవీ మరో 135 థియేటర్లలో రన్ అవుతోంది. ఈ మధ్యకాలంలో ఏ సినిమా కూడా  ఇన్ని థియేటర్లలో 50రోజులు  ఆడలేదు. ఆస్కార్ అవార్డును గెలుచుకున్న RRR, నిన్నటివరకు హయ్యస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన బాహుబలి 2 కూడా ఇన్ని థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకోలేదు. ఆదిత్య చోప్రా యూనివర్స్ లో వచ్చిన పఠాన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 30 రికార్డులను బ్రేక్ చేసినట్టు తెలుస్తోంది. 

Advertisement

Also Read :  మహేష్ బాబు పక్కన ఉన్న ఈ అమ్మాయి పాన్ ఇండియా స్టార్.. ఎవరంటే..?

Manam News

హిందీలో దంగల్ తర్వాత రూ.1000 కోట్లు వసూలు చేసిన మూవీ గా పఠాన్ నిలిచింది. అదేవిధంగా హిందీలో హయ్యెస్ట్ ఓపెనింగ్ చిత్రంగా ప్రపంచవ్యాప్తంగా రెండు మూడు నాలుగు వందల కోట్ల క్లబ్ లో ఫాస్ట్ గా చేరిన చిత్రంగా నిలిచింది. భారత దేశంలో రూ.500 కోట్లు నెట్టు కలెక్ట్ చేసిన హిందీ సినిమాగా.. యూకే లో భారీ ఓపెనింగ్ సాధించిన భారత మూవీగా.. సౌదీ అరేబియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా టాప్ గ్రాసర్ మూవీగా దాదాపు 30 రికార్డ్లను సాధించినట్టు సమాచారం. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ జవాన్ మూవీలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. జూన్ లో విడుదల చేయాలనుకున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ లో విడుదల చేయనున్నారు. షారూఖ్ నటించిన పఠాన్ సినిమా హిట్ కావడంతో జవాన్ పై భారీ హైట్ క్రియేట్ అయింది. 

Also Read :  జక్కన్న అవార్డుపై విమర్శలు చేసే వారికి చెంపపెట్టు లాంటి న్యూస్..!!

Visitors Are Also Reading