Home » చిరంజీవి, బాలకృష్ణ గురించి అల్లు రామలింగయ్యతో NTR చెప్పినవి.. ఈరోజు అక్షరాల నిజం అయ్యాయా?

చిరంజీవి, బాలకృష్ణ గురించి అల్లు రామలింగయ్యతో NTR చెప్పినవి.. ఈరోజు అక్షరాల నిజం అయ్యాయా?

by Bunty

తెలుగు భారీ చిత్రాల నిర్మాత అనగానే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చే పేరు వైజయంతి మూవీస్ అధినేత సి.అశ్విని దత్. టాలీవుడ్ లో మూడు తరాల అగ్ర హీరోలతో భారీ బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించారు. ఈరోజు ఈయన పుట్టినరోజు. ముఖ్యంగా ఆయన సీనియర్ హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్ తో పాటు కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబులతో పలు సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు. అయితే కే. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఓ సీత కథ’ కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా అశ్విని దత్ తన చలనచిత్ర జీవితాన్ని ప్రారంభించాడు.

READ ALSO : సమంతకు సెంటిమెంట్ కూడా ఉందా.. అందుకే ఆ రంగు రాళ్ళను దరిస్తుందా.. దీనికీ కారణం?


అతని అభిమాన నటుడు ఎన్టీ రామారావు తో ఒక చిత్రాన్ని నిర్మించాలని కోరుకున్నాడు మరియు అతన్ని సంప్రదించాడు. శ్రీకృష్ణుడి మెడలో ఉన్న మాలకి ఎన్టీఆర్ పేరు పెట్టారు. వైజయంతి మూవీస్ అశ్విని దత్ యాజమాన్యంలో నిర్మాణాన్ని ప్రారంభించింది. ప్రొడక్షన్ హౌస్ యొక్క లోగోలో ఎన్టీఆర్ శ్రీకృష్ణ భగవానుని వలె అతని చిత్రం ఉంది. అతని చేతిలో శంఖం మరియు భూగోళం ఉంటుంది. నిర్మాత అశ్వినీ దత్ ఎన్టీఆర్, చిరంజీవి లతో ఎక్కువ సినిమాలు రూపొందించారు. చిరంజీవితో జగదేకవీరుడు అతిలోకసుందరి, చూడాలని ఉంది, ఇంద్ర లాంటి బ్లాక్ బస్టర్స్ రూపొందించారు.

అలాగే బాలయ్యతో అశ్వమేధం చిత్రాన్ని రూపొందించారు. ఒకసారి ఓ చిత్ర షూటింగ్ విరామంలో ఎన్టీఆర్, అల్లు రామలింగయ్య ముచ్చటించుకున్నారు. ఆ క్రమంలో వారి మాటల మధ్యలో చిరంజీవి నటించిన ఖైదీ, అడవి దొంగ, పసివాడి ప్రాణం లాంటి చిత్రాలు, అలాగే బాలయ్య నటించిన మంగమ్మగారి మనవడు, అనసూయమ్మ గారి అల్లుడు, మువ్వా గోపాలుడు లాంటి చిత్రాల విజయాలను చూసిన తర్వాత ఇక ఈ సినీ పరిశ్రమ మీ అల్లుడు చిరంజీవి, మా కొడుకు బాలయ్యదేనని పెద్దాయన ఎన్టీఆర్ అల్లు రామలింగయ్యతో తరచూ అనేవారని… ఆ తర్వాత ఆ పెద్దాయన చెప్పినట్టుగానే ఆ ఇద్దరు హీరోలు అనేక సినిమా విజయాలతో సినీ పరిశ్రమలో స్టార్స్ గా ఎదిగారని ఆ ఇంటర్వ్యూలో నిర్మాత సి. అశ్విని దత్ తెలియజేశారు.

READ ALSO : కె.విశ్వనాథ్ మృతి..ఆయన మరణానికి అసలు కారణం ఇదే…!

Visitors Are Also Reading