Home » మహేష్ బాబు పక్కన ఉన్న ఈ అమ్మాయి పాన్ ఇండియా స్టార్.. ఎవరంటే..?

మహేష్ బాబు పక్కన ఉన్న ఈ అమ్మాయి పాన్ ఇండియా స్టార్.. ఎవరంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

కొన్ని సినిమాల్లో నటించిన నటీనటులు హీరో హీరోల కంటే ఎక్కువగా గుర్తింపు సాధిస్తూ ఉంటారు. వారు చేసేది చిన్న పాత్రే అయినా జనాలకు చాలా కనెక్ట్ అవుతూ ఉంటారు. అలాంటి వారు భవిష్యత్తులో మంచి పొజిషన్ కు వెళుతూ ఉంటారు. అలాంటి ఓ అమ్మాయి మహేష్ బాబుతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో నటించింది. ఆమె చేసింది చిన్న పాత్ర అయినప్పటికీ అందరికీ గుర్తిండి పోయే రేంజ్ కి వెళ్ళింది.. ఈ పై ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు సుప్రియ .. ఈమె ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలు ముఖ్యమైన పాత్రల్లో పోషించింది.

Advertisement

Also Read:“మగధీర”కు మొదట అనుకున్న స్టార్ ఎవరో తెలుసా…?

ముఖ్యంగా బాబు బాగా బిజీ అనే చిత్రంలో వే* పాత్ర పోషించి సంచలనం క్రియేట్ చేసింది. ఇందులో ప్రముఖ నటుడు రచయిత అవసరాల శ్రీనివాస్ హీరోగా నటించాడు. ఈ పాత్ర తర్వాత తెలుగులో ఆమెకు అలాంటి పాత్రలలే ఎక్కువగా వచ్చాయట. కానీ అలాంటి వాటిలో నటించడం ఇష్టం లేక తెలుగు ఇండస్ట్రీని వదిలి బాలీవుడ్లోకి వెళ్ళింది. అక్కడ ఈమెకు అదృష్టం కలిసి వచ్చి పవర్ఫుల్ పాత్రలు వచ్చాయి. తెలుగు అమ్మాయి అయ్యుండి ఇక్కడ అవకాశాలు రాక అక్కడికి వెళ్లడం దురదృష్టకరమే కానీ సక్సెస్ అయిందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు.

Advertisement

Also Read:చిరంజీవి, బాలకృష్ణ గురించి అల్లు రామలింగయ్యతో NTR చెప్పినవి.. ఈరోజు అక్షరాల నిజం అయ్యాయా?

ఈమె రీసెంట్ గా విక్టరీ వెంకటేష్ రాణా దగ్గుబాటి కాంబినేషన్ వచ్చిన రానా నాయుడు అనే వెబ్ సిరీస్లో కీలకపాత్రను పోషించింది. ఈ సినిమాలో ఆమె పాత్ర కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ప్రస్తుతం ఆమె లేటెస్ట్ లుక్స్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించిన అమ్మాయి ఈ అమ్మాయేనా అంటూ షాక్ కు గురవుతున్నారు. ప్రస్తుతం సుప్రియ పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు కూడా చేసింది.

Also Read:లిక్కర్ కేసులో ఈడికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన కల్వకుంట్ల కవిత?

Visitors Are Also Reading