Home » వ‌చ్చే నెల‌లో ఈ మూడు రాశుల వారి బ్యాంకు బ్యాలెన్స్ పెరిగే ఛాన్స్‌..!

వ‌చ్చే నెల‌లో ఈ మూడు రాశుల వారి బ్యాంకు బ్యాలెన్స్ పెరిగే ఛాన్స్‌..!

by Anji
Ad

ప్ర‌తి కొత్త నెల ప్ర‌జ‌ల‌కు కొత్త ఆశ‌ను తీసుకొస్తుంది. ఇలాంటి ప‌రిస్తితుల్లో జులై నెల‌లో ప్ర‌జ‌లు అంచనాలు ఏర్ప‌డ్డాయి. రాబోయే కాలం త‌న‌కు ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉండాల‌ని.. శుభ‌ఫ‌లితాలు రావాల‌ని ప్ర‌తి వ్య‌క్తి కోరిక‌. జులై నెల‌లో చాలా గ్ర‌హాలు రాశి చ‌క్రాన్ని మార్చ‌బోతున్నాయి. ముఖ్యంగా జులైలో సూర్యుడు, శుక్రుడు, బుధుడు వంటి అనేక పెద్ద గ్ర‌హాలు రాశి చ‌క్రాన్ని మార్చ‌బోతున్నాయి. 68 రోజుల త‌రువాత జులై 2న బుధుడు త‌న రాశిని మార్చి మిథున‌రాశిలోకి ప్ర‌వేశిస్తాడు. జులై 16న సూర్య‌భ‌గ‌వానుడు క‌ర్కాట‌క రాశిలోకి ప్ర‌వేశిస్తాడు. కుజుడు, శుక్రుడు రాశి మార్పు కూడా ఈ మాసంలోనే జ‌రుగ‌బోతుంది. ఏయే రాశుల వారికి ప్ర‌యోజ‌నం క‌లుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

మిథున రాశి :

ఈ రాశి వారికి జులై నెలలో కూడా శుభ‌ప్ర‌దంగా ఉంటుంది. మీరు కార్యాల‌యంలో గౌర‌వం పొందుతారు. ఈ స‌మ‌యంలో కొన్ని పెద్ద బాధ్య‌త మీ భుజాల‌పై ప‌డ‌వ‌చ్చు. మీరు మీ వ్యాపారాన్ని విస్త‌రించాల‌ని ఆలోచిస్తున్న‌ట్ట‌యితే స‌మ‌యం అనుకూలంగా ఉంటుంది. అదే స‌మ‌యంలో ఉద్యోగస్తుల‌కు ప‌దోన్న‌తి ల‌భించే అవ‌కాశముంది. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వ్య‌క్తులు మంచి జాబ్ ఆఫ‌ర్‌ను పొందొచ్చు. జులైలో పూర్వీకుల ఆస్తి నుంచి లాభ‌ముంటుంది. పెట్టుబ‌డి పెంచాల‌ని ఆలోచిస్తున్న‌ట్ట‌యితే స‌మ‌యం అనుకూలంగా ఉంటుంది.

Advertisement

సింహ‌ రాశి :

ఈ రాశి వారికి చాలా స‌మ‌యం చాలా అనుకూలంగా ఉంటుంది. కార్యాలయంలో విజ‌య‌ముంటుంది. అదేస‌మ‌యంలో ప్ర‌మోష‌న్ కు బ‌ల‌మైన అవ‌కాశాలున్నాయి. ఈలోగా నిలిచిపోయిన ప‌నులు పూర్తి అవుతాయి. మీరు గ్ర‌హాల రాశి మార్పుల ప్ర‌యోజ‌నాన్ని పొంద‌బోతున్నారు. ఈ స‌మ‌యంలో మీరు ఆఫీస్‌లో మంచి ప‌ని చేస్తారు. మంచి జాబ్ ఆఫ‌ర్ కూడా రావ‌చ్చు. విదేశాల్లో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారు విజ‌యం సాధిస్తారు. వ్యాపారంలో కూడా లాభం ఉంటుంది.

ధ‌న‌స్సు రాశి

ఈ రాశి వారికి ఆర్థిక కోణం ప్ర‌కారం.. ఈ మాసం లాభ‌దాయ‌కంగా ఉంటుంది. ఐశ్వ‌ర్యానికి అధిదేవ‌త అయిన కుబేరుడు ఈ కాలంలో చాలా అనుగ్ర‌హాన్ని కురిపిస్తాడు. ఆ స‌మ‌యంలో డ‌బ్బు రాక కోసం కొత్త మార్గాలు తెర‌వ‌బ‌డుతాయి. భూమి, ఆస్తికి సంబంధించిన విష‌యాల్లో కూడా లాభ‌ప‌డే అవ‌కాశ‌ముంది. పెట్టుబ‌డి పెట్టాల‌ని ఆలోచిస్తున్న‌ట్ట‌యితే ఈ స‌మ‌యం అనుకూలంగా ఉంటుంది.

Visitors Are Also Reading