Home » ప్రధాని మోడీ కుటుంబం గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు ఇవే..!

ప్రధాని మోడీ కుటుంబం గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు ఇవే..!

by Anji
Ad

భారత ప్రధాని నరేంద్ర మోడీ  గురించి దాదాపు అందరికీ తెలిసిందే. 1950లో గుజరాత్ లో జన్మించిన మోడీ ఆర్.ఎస్.ఎస్.లో చేరడం, రాజకీయ ప్రయాణానికి నాంది పలికింది. 2001 నుంచి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేశారు.  ఇక ఆ సమయంలో గుజరాత్ రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందింది.  గుజరాత్ డెవలప్ మెంట్ విషయంలో ప్రధాని పాత్ర చాలా కీలకమనే చెప్పాలి.  ముఖ్యంగా  2014లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి మోడీకి ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుల్లో ఒకరిగా మారి..  చాలా  ముఖ్యమైన కార్యక్రమాలను ప్రారంభించారు.

Advertisement

మోడీ ప్రభుత్వ పథకాలతో పాటు దేశ అభివృద్ధి కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా  అతని ప్రత్యర్థుల నుంచి అతన్ని వేరుగా ఉంచేది అతని కుటుంబం. కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్ తో సహా పలు ప్రతిపక్ష పార్టీలు కుటుంబ ఆధారిత రాజకీయాలతో నడిచే యుగంలో.. ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం తన కుటుంబాన్ని రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజల దృష్టికి దూరంగా ఉండేవిధంగా చూసుకున్నారు. ప్రధాని తోబుట్టువుల గురించి చాలా మందికి తెలియదు. అసలు ఆయనకు ఎంతమంది తోబుట్టువులు ఉన్నారో కూడా తెలియని వారు చాలా మందే ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తల్లిదండ్రులు హీరా బెన్, దామోదర దాస్ ముల్చంద్ మోడీలకు సోమాభాయ్ మోడీ, పంకజ్ మోడీ, నరేంద్ర మోడీ, ప్రహ్లద్ మోడీ, వాసం తీబెన్ హస్ముఖ్ లాల్ మోడీ, అరవింద్ మోడీ అనే ఆరుగురు సంతానం. వీరు ఇప్పుడు ఏం చేస్తున్నారనే విషయాలను మనం  తెలుసుకుందాం. 

సోమాభాయ్ మోడీ 

సోమాభాయ్ మోడీ మాజీ ఆరోగ్య అధికారి. ప్రస్తుతం అహ్మదాబాద్ లోని వృద్ధుల నివాసాన్ని పర్యవేక్షిస్తున్నారు. సోమాబాయ్ తన తమ్ముడు నరేంద్ర మోడీని రెండోసారి ప్రధాన మంత్రిగా చేపట్టినప్పటి నుంచి చూడలేదు. సోదరులు ఎప్పుడూ ఫోన్ లో మాత్రమే కమ్యూనికేట్ చేశారు. 

పంకజ్ మోడీ : 

Advertisement

అతి పిన్న వయస్కుడైన మోడీ తోబుట్టువు పంకజ్ గుజరాత్ సమాచార విభాగంగా అధికారిగా పని చేస్తున్నారు. అంతకు ముందు ఆరు నెలల్లో రాష్ట్ర రాజధానిలో తన సోదరుడిని రెండుసార్లు మాత్రమే కలిశారు. పంకజ్ వారి తల్లి హీరాబెన్ తో కలిసి నివసించాడు.  ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ చనిపోవడానికి ముందు పలు సందర్భాల్లో సందర్శించడానికి వెళ్లాడు. 

అమృత్ మోడీ : 

అమృత్ భాయ్ మోడీ ప్రధాని నరేంద్ర మోడీకి పెద్ద తోబుట్టువు. ఇండియా టుడే మూలాల ప్రకారం.. అమృత్ భాయ్ ఓ ప్రైవేట్ సంస్థలో ఫిట్టర్ గా పని చేసి రిటైర్డ్ అయిన వ్యక్తి. సర్వీస్ రోజుల్లో నెలకు రూ.10వేలలోపే వచ్చేది. ఇప్పుడు పదవీ విరమణ తరువాత.. అతను తన కుమారుడు సంజయ్ అతని కుటుంబంతో అహ్మాదాబాద్ లోని వారి ఇంట్లో నిశ్చబ్దంగా నివసిస్తున్నారు. 

ప్రహ్లాద్ భాయ్ మోడీ 

ప్రహ్లాద్ భాయ్ మోడీ.. మరో మోడీ తో బుట్టువు  దుకాణం యజమాని.  నరేంద్ర మోడీ కాకుండా రాజకీయాల్లో తన ప్రయత్నాలు చేసిన ఏకైక మోడీ తోబుట్టువు ఈయనే కావడం విశేషం. ఇతను గుజరాత్ స్టేట్ ఫెయిర్ ప్రైస్ ఓనర్స్ అసోసియేషన్ అధినేత. 2001లో స్థాపించిన ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్స్ కి వైస్ ప్రెసిడెంట్ గా పని చేస్తున్నాడు. వాసంతీ బెన్ హస్ముఖ్ లాల్ మోడీ-నరేంద్ర మోడీ సోదరి.  నరేంద్రమోడీకి వాసం తీబెన్ హస్ముఖ్ లాల్ మోడీ ఏకైక సోదరి. ఆమె గృహిణి. ఆమె భర్త పేరు హస్ముఖ్ భాయ్, మాజీ LIC అధికారి. ప్రతీ ఏడాది రక్షాబంధన్ సందర్భంగా.. ఆమె నరేంద్ర మోడీని సందర్శిస్తుంది. రక్షాబంధన్ పండుగ వేళ ఆమె ప్రతీ ఏడాది నరేంద్ర మోడీకి రాఖీ కట్టడం ఆనవాయితీ. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ తన కుటుంబాన్ని ప్రజల  దృష్టికి దూరంగా ఉంచడానికి ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం వ్యూహాత్మకమనే చెప్పవచ్చు. ముఖ్యంగా తన కుటుంబ సభ్యులు రాజకీయాలకు దూరంగా ఉండటం.. వ్యక్తిగతంగా దూరంగా ఉండటం ఎవ్వరి పని వారు చేసుకోవడం చాలా గొప్పవిషయం అని పలువురు పేర్కొంటున్నారు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

ఎవరీ రచిన్‌ రవీంద్ర ఇంత టాలెంటెడ్‌గా ఉన్నాడు? అనంతపురంతో లింక్ ఏంటి?

ది వ్యాక్సిన్ వార్ పై ప్రధాని మోడీ ప్రశంసలు.. దర్శకుడి ట్వీట్..!

Visitors Are Also Reading