Home » పెళ్లైన స్త్రీలు బరువు పెరగడానికి గల కారణాలు ఇవే..!

పెళ్లైన స్త్రీలు బరువు పెరగడానికి గల కారణాలు ఇవే..!

by Anji
Ad

సాధారణంగా పెళ్లి అనేది ఎవరి జీవితంలోనైనా  చాలా ముఖ్యమైంది. ప్రధానంగా అమ్మాయిలు తమ పెళ్లి విషయంలో చాలా కలలు కంటారు. పెళ్లిరోజు స్లిమ్ గా, అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలని కోరుకుంటారు. కానీ పెళ్లి తర్వాత అమ్మాయిలు ఒక్కసారిగా బరువు  పెరుగుతుంటారు. చాలామంది అమ్మాయిలు పెళ్లయిన నెలలోనే ఊబకాయం బారిన పడుతారు. అలాంటి సంఘటనలను మనం తరచూ చూస్తూనే ఉన్నాం. వారు అంత వేగంగా బరువు పెరిగిపోవడానికి కారణాలేమిటి..? మీరు కూడా ఎప్పుడైనా ఈ విషయం గురించి ఆలోచించారా ? పెళ్లి అయిన అమ్మాయిలు ఆ సంవత్సరం లోపే బరువు పెరగడానికి గల కారణాలు ఏంటో  ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Manam News

Advertisement

Advertisement

  •  పెళ్లికి ముందు ఆడపిల్లలు డైట్, వ్యాయామం చేస్తూ తన బరువుని కంట్రోల్ లో ఉంచుకుంటారు. ఎందుకంటే తనకు కాబోయే భర్తకు నచ్చాలని వారు ఆరాటపడుతారు. కానీ వివాహమైన వెంటనే వారు తమ డైట్ ని వదిలిపెట్టి రిలాక్స్ అవుతారు. ఇన్ని రోజులు చేసిన డైట్ ఒక్కసారిగా వదిలివేయడంతో ఆ ఎఫెక్ట్ శరీరంపై పడుతుంది. ఎక్కువగా శ్రమ లేకపోవడం, అధికంగా నిద్ర పోవడం వల్ల  బరువు పెరుగుతారు.
  • పెళ్లి తర్వాత అమ్మాయిలు తరచుగా ఇంటి పనుల్లో బిజీగా గడుపుతారు. అంతేకాదు.. బంధువుల ఇంటికి వెళ్లడం పూజలు, ఇతర కార్యక్రమాలలో పాల్గొనడం జరుగుతుంది. దీంతో శరీరక శ్రమలపై శ్రద్ధ చూపలేరు. దీని కారణంగా కడుపు, నడుము దగ్గర కొవ్వు పేరుకుపోతుంది.
  • పెళ్లిరోజు నుంచి చాలా రోజుల వరకు ఆచారాల పేర్లమీద రకరకాల పార్టీలు జరుగుతుంటాయి. ఇక ఆ సమయంలో బంధువుల ఇంటికి వెళ్లుతుంటారు. ఇలాంటి సందర్భాలలో అమ్మాయిలు అనారోగ్యకరమైన ఆహారం, కొవ్వు అధికంగా ఉండే మాంసాహారాలు తింటారు. దీంతో ఒక్కసారిగా బరువు పెరుగుతారు.

Also Read :  పెరిగిన గడ్డం మెడలో రుద్రాక్ష….తారకరత్న కొత్త లుక్ కి కారణం ఏంటో తెలుసా….?

  • Manam News
    వివాహం జరిగిన తరువాత  అమ్మాయిలు జాబ్ చేస్తున్నట్లయితే అదనపు బాధ్యతల వల్ల టెన్షన్ పెరుగుతుంది. దీనివల్ల బరువు పెరుగుతారని చాలా పరిశోధనల్లో రుజువైంది.
  • పెళ్లయిన వెంటనే కుటుంబాన్ని చూసుకోవడం వల్ల మహిళలు చాలా బిజీ అయిపోతారు. దీనివల్ల సరిగ్గా నిద్ర పట్టదు. తక్కువ నిద్ర కారణంగా బరువు వేగంగా పెరుగుతారు. అంతేకాకుండా శరీరంలో హార్మోన్ల మార్పులు సంభవిస్తాయి. ఇది కూడా బరువు పెరగడానికి కారణం అవుతుంది.

Also Read :  Jabardasth : జబర్దస్త్ కి దిష్టి తగిలిందా..? అదిరే అభి సంచలన పోస్ట్

Visitors Are Also Reading