Home » పెరిగిన గడ్డం మెడలో రుద్రాక్ష….తారకరత్న కొత్త లుక్ కి కారణం ఏంటో తెలుసా….?

పెరిగిన గడ్డం మెడలో రుద్రాక్ష….తారకరత్న కొత్త లుక్ కి కారణం ఏంటో తెలుసా….?

by AJAY
Ad

టాలీవుడ్ నటుడు తారకరత్న గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగ్గా ఉందని సొంతంగా శ్వాస తీసుకుంటున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇకపై తారకరత్న ఆరోగ్య విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్ లు చెబుతున్నారు.

Advertisement

ఇదిలా ఉంటే ఒకప్పుడు తారకరత్న స్టైలిష్ లుక్ లో కనిపిస్తూ లవర్ బాయ్ గా కనిపించిన సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా తారకరత్న పొడవాటిగడ్డం, నిదుటిన బొట్టు, మెడలో రుద్రాక్ష తో కనిపిస్తున్నారు. దాంతో తారకరత్న ఎందుకు ఇలా మారిపోయాడు అన్న డౌట్ చాలా మందిలో ఉంది. కాగా తాజాగా తారకరత్న గురించి ఆయన స్నేహితులు ఆశ్చర్యకర విషయాలను వెల్లడించారు.

Advertisement

మూడేళ్ళనుండి తారక్ పూర్తిగా మారిపోయారని చెప్పారు. పార్టీలకు దూరంగా ఉంటున్నాడని అన్నారు. ఒకప్పుడు సిగరెట్ తాగే అలవాటు ఉండగా మూడేళ్ల నుంచి పూర్తిగా మానేశాడని చెప్పారు. ఇంట్లో పాపతో ఆడుకోవడం…. ఆ తర్వాత బయటకు వెళ్లి పని చూసుకోవడం ఇదే తారకరత్న డైలీ లైఫ్ అని అన్నారు. అంతే కాకుండా ఉదయాన్నే 5 గంటలకు లేవడం ఆ తర్వాత వ్యాయామం చేసి రెండు గంటలు పూజలో కూర్చోవడం లాంటివి చేస్తూ పూర్తిగా ఆధ్యాత్మికం వైపు అడుగులు వేశాడని చెబుతున్నారు.

అంతేకాకుండా ఎవరితోనూ గొడవలకు వెళ్లకుండా ఉండేవాడని…తనను ఏమైనా అన్నా కూడా కోపం తెచ్చుకోకుండా చాలా సౌమ్యంగా ఉండేవాడని చెప్పారు. మరోవైపు మూడేళ్ల నుండి రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నాడని… పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనుకున్నాడని చెబుతున్నారు.

Also read :Jabardasth : జబర్దస్త్ కి దిష్టి తగిలిందా..? అదిరే అభి సంచలన పోస్ట్

Visitors Are Also Reading